Breakfast Scheme | ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన మంత్రి పొన్నం
Breakfast Scheme | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం (Breakfast Scheme) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు.
Breakfast Scheme | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం (Breakfast Scheme) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది.. అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

వారంలో 6 రోజులు మంచి బ్రేక్ ఫాస్ట్ పాలు, రాగి జావాను అందిస్తున్నామని.. దాదాపు రూ.800 కోట్ల వ్యవయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. సర్కారు బడిలో చదివితేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే రోజులు రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు కావాలి కానీ ప్రభుత్వ దవాఖానలు, బడులు వద్దనే భావన ఉందని తెలిపారు. దాన్ని తొలగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని పేర్కొన్నారు.
మెనూ..
- సోమవారం- దోసె, చట్నీ లేదా చపాతీ, కూర- పాలు
- మంగళవారం- మిల్లెట్ ఇడ్లీ (2),సాంబార్- రాగి జావ
- బుధవారం- పూరీ (2), ఆలూ కుర్మా- పాలు
- గురువారం- మిల్లెట్ ఇడ్లీ (2), సాంబార్- రాగి జావ
- శుక్రవారం- మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్, చట్నీ- పాలు
- శనివారం- బొండా (2), చట్నీ- రాగి జావ

తొలి విడతలో 1302 బడుల్లో..
తొలి విడతలో భాగంగా మొత్తం 1302 బడుల్లో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 1269 స్కూళ్లు, 33 కాలేజీలు ఉన్నాయి. వాటిలోని మొత్తం 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఉదయం పూట అల్పాహారం అందనుంది.
సెంట్రలైజ్డ్ కిచెన్లు..
ఈ పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విడతల వారీగా కొత్త విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అమలు చేయనున్నారు. మొత్తం 33 జిల్లాల్లో 39 చోట్ల సెంట్రలైజ్డ్ కిచెన్లను నిర్మించనుంది. అందులో ఇప్పటికే 7 కిచెన్లను ఆధునీకరిస్తున్నారు.

హరే కృష్ణ మూమెంట్.. మన్నా ట్రస్ట్
బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లు మొత్తం ఎనిమిది జిల్లాల్లో అమలు చేయనున్నాయి. వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని 1,162 పాఠశాలల్లో 1,03,891 మంది విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ ఈ పథకాన్ని అమలు చేయనుంది. వికారాబాద్, నారాయణపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 10,293 మందికి కూడా బ్రేక్‌ఫాస్ట్ అందుతుంది.
ఇక హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 107 పాఠశాలల్లో చదివే 26,294 మంది విద్యార్థులకు మన్నా ట్రస్ట్ ద్వారా భోజనాన్ని అందిస్తారు. ఈ రెండు జిల్లాల్లో 12 కళాశాలల్లోని 4,132 మందికి కూడా లభిస్తుంది. మొత్తంగా ఈ పథకంతో రాష్ట్రంలోని 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
తాజావార్తలు
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు






