Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
Tejas Express | దేశంలో మొట్టమొదటి ప్రైవేట్, బ్రాండెడ్ రైలు (First Private Train) అయిన తేజస్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) పేరు మారుతున్నది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ సెమీ హై స్పీడ్ రైలును ఇకపై..
Tejas Express | త్రినేత్ర.న్యూస్: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్, బ్రాండెడ్ రైలు (First Private Train) అయిన తేజస్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) పేరు మారుతున్నది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ సెమీ హై స్పీడ్ రైలును ఇకపై స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌గా (Sprite Tejas Express) పిలువనున్నారు. ఢిల్లీ-లక్నో మధ్య నడుస్తున్న ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తున్నది. అయితే తేజస్ ఎక్స్‌ప్రెస్ బ్రాండింగ్ ద్వారా ప్రకటనల హక్కులను మిసెస్ స్ప్రైట్ (M/s Sprite) అనే సంస్థ దక్కించుకున్నది. దీంతో తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను స్ప్రైట్ తేజస్‌గా వ్యవహరించనున్నారు. ఆగస్టు 19 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆరు నెలల పాటు అంటే నవంబర్ 11 వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ మేరకు నార్త్ ఈస్టర్న్ రైల్వేకు తెలియజేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు అయిన తేజస్ ఎక్స్‌ప్రెస్ 2019, అక్టోబర్ 4న పట్టాలెక్కింది. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటైన లక్నో-ఢిల్లీ-లక్నో (Lucknow-Delhi-Lucknow) మార్గంలో ఇది సేవలు అందిస్తున్నది. ఇతర రైళ్లతో పోలిస్తే ఇందులో టికెట్ల ధరల అధికంగా ఉంటాయి. అయితే సౌకర్యం, సరైన సమయంలో గమ్యస్థానాలకు చేర్చడం, అత్యాధునిక సేవలు వంటి అత్యద్భుతమైన అనుభవాన్ని ప్రయాణికులకు ఈ రైలు అందిస్తున్నది.

టికెట్ ధర ఎక్కువే..
ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కార్ ధర రూ.1679, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధ రూ.2457గా ఉంది. అయితే అదే మార్గంలో ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏసీ చైర్ కార్ ధర రూ.1255, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.1955, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏసీ చైర్ కార్ ధర రూ.1255గా ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2,415గా ఉంది. ఇక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ థర్డ్ టైర్ టికెట్ ధర రూ.1590, ఏసీ సెకండ్ టైర్ (2ఏ) రూ.2,105, ఏసీ ఫస్ట్ క్లాస్ (1ఏ) టికెట్ ధర రూ.2,630గా ఉంది.
సంబంధిత వార్తలు

Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్కరణలు ఓకే.. కానీ సరిగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది
ఆగస్టు 11, 2026

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026

AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేందుకు కుట్ర!
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు



