త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | అత‌డో అప‌రిచితుడు – సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి – మాజీ ప్రియుడిపై అనుప‌మ ఆరోప‌ణ‌లు

మాజీ ప్రియుడిపై హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సంచ‌న‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అత‌డి వ‌ల్ల గ‌త రెండేళ్లుగా న‌ర‌కం అనుభ‌వించాన‌ని చెప్పింది. అత‌డిని పెళ్లి చేసుకుంటే ఈ పాటికి విడాకుల‌తో త‌మ బంధం ముగిసిపోయుండేద‌ని అన్న‌ది. అనుప‌మ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.

N

Entertainment | Published On Aug 13, 2026, 9.51 am IST

Anupama Parameswaran |  అత‌డో అప‌రిచితుడు – సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి – మాజీ ప్రియుడిపై అనుప‌మ ఆరోప‌ణ‌లు
Advertisement

Anupama Parameswaran |  మాజీ ప్రియుడిపై టాలీవుడ్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అత‌డిది విక్ర‌మ్ అప‌రిచితుడు సినిమాలో హీరో లాంటి మ‌న‌స్త‌త్వ‌మ‌ని అన్న‌ది. రెమోలా అంతులేని ప్రేమ‌ను కురిపిస్తాడ‌ని, ఆ త‌ర్వాత రోజే మాన‌సికంగా, శారీరంక‌గా హింసించేవాడ‌ని చెప్పింది. కోలీవుడ్ యంగ్ హీరోతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా ప్ర‌చారం జ‌రిగింది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ప్రియుడితో ఇటీవ‌లే అనుప‌మ తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ల‌వ్ బ్రేక‌ప్‌పై సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఈ విఫ‌ల ప్రేమాయ‌ణంపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది.

అప‌రిచితుడిగా...

"ప్రారంభంలో అన్ని బంధాలు బాగానే అనిపిస్తాయి. ప్ర‌తి రోజు ఎంతో ఆనందంగా, అంద‌మైన క‌ల‌లా గ‌డిచిపోతుంది. ఓ వ్య‌క్తితో ఏర్ప‌డిన‌ రిలేష‌న్ కార‌ణంగా నేను అలాంటి అనుభూతికే లోన‌య్యా. కానీ కాలం గ‌డిచే కొద్ది అత‌డి అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. విక్ర‌మ్ హీరోగా న‌టించిన అప‌రిచితుడు సినిమాలో హీరోలా మారిపోయేవాడు. ఓ రోజు రెమోలా చాలా ప్రేమ‌ను కురిపించేవాడు. ఆ త‌ర్వాత రోజు క్రూరంగా ప్ర‌వ‌ర్తించేశాడు. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పేవాడు. ఇంకోసారి ఇలా చేయ‌న‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఎన్నో ప్రామిస్‌లు చేసేవాడు" అని అనుప‌మ అన్న‌ది.

రెండేళ్లు న‌ర‌కం...

"ఆ వ్య‌క్తి పేరు చెప్ప‌డం నాకు ఇష్టం లేదు. కానీ అత‌డి వ‌ల్ల గ‌త రెండేళ్లుగా ఎంతో న‌ర‌కం అనుభ‌వించా. ప్ర‌తి క్ష‌ణం నాపై ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నించేవాడు. సోష‌ల్ మీడియా పోస్ట్‌లు, డ్రెస్‌ల ఎంపిక కూడా అత‌డి ఇష్టం ప్ర‌కార‌మే ఉండాల‌ని అనేవాడు. చివ‌ర‌కు నా సినిమాల విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు. అత‌డి వ‌ల్లే ఎన్నో సినిమాల‌ను వ‌దులుకున్నా. నా కెరీర్‌లోనే పెద్ద హిట్ట‌యిన డ్రాగ‌న్ ప్ర‌మోష‌న్స్‌కు కూడా అటెండ్ కాలేక‌పోయా. సెట్స్‌లో స‌హ న‌టుల‌తో మాట్లాడ‌టానికి, చివ‌ర‌కు సొంత త‌మ్ముడికి కూడా తాక‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితికి వ‌చ్చా"అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వెల్ల‌డించింది.

డిప్రెష‌న‌ల్‌లోకి వెళ్లిపోయా....

"మాన‌సికంగా ఒత్తిడిని త‌ట్టుకోలేక డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా. మందులు వాడ‌టం మొద‌లుపెట్టా. ఒక్కోసారి సెట్స్‌లోనే తీవ్రమైన ఆందోళ‌న‌కు గురై కారావ్యాన్‌లోకి వెళ్లిపోయి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ప‌రిచ‌య‌మైన మూడు నెల‌ల్లోనే పెళ్లి చేసుకుందామ‌ని అన్నాడు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు న‌న్ను ప‌రిచ‌యం చేశాడు. కానీ ప్రేమ‌తో ఆ ప్ర‌పోజ‌ల్ తీసుకురాలేద‌ని అర్థం చేసుకున్నా. న‌న్ను న‌ట‌న మాన్పించి త‌న కంట్రోల్‌లో ఉంచుకోవ‌డానికే అలా చేశాడ‌ని తెలుసుకున్నా. అందుకే ఎంగేజ్‌మెంట్‌ను వాయిదావేస్తూ వ‌చ్చా. ఒక‌వేళ పెళ్లి చేసుకుంటే ఈ పాటికి మా బంధం విడాకుల‌తో ముగిసిపోయుండేది" అని అనుప‌మ చెప్పింది.. బ్రేక‌ప్‌పై అనుప‌మ చేసిన కామెంట్లు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

 

Advertisement
Advertisement