Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. బంగారం కొనేందుకు సరైన సమయమా..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తుండడం, అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి చర్చలు చేపట్టడంతో ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమ స్పందనతో ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్‌లలో మాత్రం ఆశావహ దృక్పథం నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే ధోరణిని అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తుండడం, అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి చర్చలు చేపట్టడంతో ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమ స్పందనతో ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్‌లలో మాత్రం ఆశావహ దృక్పథం నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే ధోరణిని అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. బంగారం, వెండి ధరలు మంగళవారం సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. కానీ దేశీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం మేర పెరిగి 4,062 డాలర్లకు చేరగా, వెండి ధర 1.35 శాతం మేర పెరిగి 58 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 812 పాయింట్లు పెరిగి 1,43,727 వద్దకు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,966 పాయింట్లు పెరిగి 2,19,646 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,400 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,000 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,40,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,200 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,600 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,20,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,800 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,400గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,80,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,600 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
ఆగస్టు 7, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు పెరిగిన పసిడి ధర.. మళ్లీ రెక్కలు..
ఆగస్టు 6, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు పెరిగిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?



