త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | మోదీ వ్యాఖ్య‌ల‌ వ‌ల్లే ప్యానిక్.. పెట్రోల్ కొర‌త‌పై మంత్రి పొన్నం క్లారిటీ

Ponnam Prabhakar | క‌రోనా లాంటి ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే క‌స్ట‌మ‌ర్లంతా క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. బ‌డ్జెట్‌పై బీజేపీ స‌భ్యుడు పాయ‌ల్ శంక‌ర్ మాట్లాడుతుండ‌గా.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్పీక‌ర్ అనుమ‌తి తీసుకుని పెట్రోల్, గ్యాస్ కొర‌తపై వ‌స్తున్న పుకార్ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

S

Telangana | Published On Mar 25, 2026, 5.51 pm IST

Ponnam Prabhakar | మోదీ వ్యాఖ్య‌ల‌ వ‌ల్లే ప్యానిక్.. పెట్రోల్ కొర‌త‌పై మంత్రి పొన్నం క్లారిటీ
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : క‌రోనా లాంటి ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే క‌స్ట‌మ‌ర్లంతా క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. బ‌డ్జెట్‌పై బీజేపీ స‌భ్యుడు పాయ‌ల్ శంక‌ర్ మాట్లాడుతుండ‌గా.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్పీక‌ర్ అనుమ‌తి తీసుకుని పెట్రోల్, గ్యాస్ కొర‌తపై వ‌స్తున్న పుకార్ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్యానిక్ ఉంది. నిన్న, మొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ.. క‌రోనా ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని చెప్ప‌డంతో అంద‌రూ కూడా ఒక ప్యానిక్ అయిపోయారు. పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరారని మంత్రి పొన్నం అన్నారు.

ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్యేలు క‌ల్పించుకుని.. ఇది స‌భ‌కు సంబంధించిన విష‌యం కాదు బ‌య‌ట మాట్లాడుదామ‌ని మంత్రికి సూచించారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రైమ్ మినిస్ట‌ర్ స్టేట్‌మెంట్‌తోనే క‌న్ఫ్యూజ‌న్ వ‌చ్చింది.. కాబ‌ట్టి స‌భ్యులందరూ ఇక్క‌డే ఉన్నారు. స‌భ్యులంద‌రికీ సంబంధించిన విష‌యం ఇది. కాబ‌ట్టి స్పీక‌ర్ అనుమ‌తితో మాట్లాడుతున్నాను. వేరే ఉద్దేశం కాదు.. రాష్ట్రం మొత్తం క‌స్ట‌మ‌ర్లు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. ఓల్డ్ డ్యూ రూ. 80 ల‌క్ష‌లు క‌డితేనే.. స్టాక్స్ ఇస్తామ‌నే రీజ‌న్ చెబుతున్నారట‌. ఇది ప‌క్క‌న పెడితే.. ప్రైమ్ మినిస్ట‌ర్ స్టేట్‌మెంట్ వ‌ల్ల మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్యానిక్ అయిపోయారు. అయితే 60 రోజుల స్టాక్ తెలంగాణ‌లో ఉంది. ప్ర‌జ‌లెవ‌రూ ఎక్క‌డా ఇబ్బంది ప‌డొద్దు. పెట్రోల్ నిల్వ‌ల‌తో పాటు ఇంటి అవ‌స‌రాల‌కు సంబంధించిన గ్యాస్ నిల్వ‌లు 60 రోజుల వ‌ర‌కు ఉన్నాయి. పెట్రోల్, గ్యాస్ అంశం సెంట్ర‌ల్ కంట్రోల్‌లో ఉంది కాబ‌ట్టి.. బీజేపీ స‌భ్యుల‌ను కోరుతున్నాన‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement