Komatireddy Venkatreddy | వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తానంటేనే పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkatreddy | రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
Komatireddy Venkatreddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. హామీ లేకుంటే ఎన్నికల నుంచి తప్పుకుంటానని తేల్చిచెప్పారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా నాకు సొంత ఇల్లు, ఆస్తులు లేవు. అద్దె ఇంట్లో ఉంటున్నా.. వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన రాజకీయ నిబద్ధతను,ఆస్తుల వివరాలను ప్రస్తావించిన ఆయన స్వార్థం కోసం కాకుండా, కేవలం ప్రజల సేవ కోసమే రాజకీయాలు చేస్తున్నానని పేర్కొన్నారు.
నల్లగొండ పట్టణాభివృద్ధిపై తనకున్న లక్ష్యాన్ని చాటిచెప్పిన ఆయన, నల్లగొండను సాధారణ పట్టణంలా కాకుండా ఒక అత్యాధునిక నగరంగా, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నల్లగొండను కార్పొరేషన్‌గా మార్చామని, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు.
సంబంధిత వార్తలు

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
ఆగస్టు 12, 2026

Vakiti Srihari | ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి
ఆగస్టు 12, 2026

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు



