త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ – విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేక‌ర‌ణ పూర్తి

Komatireddy Venkatreddy | తెలంగాణ‌లో 280 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నిర్మాణం కానున్న నాగ్‌పూర్ - విజ‌య‌వాడ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకర‌ణ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌యిన‌ట్లు రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Sep 12, 2026, 6.18 pm IST

Komatireddy Venkatreddy | నాగ్‌పూర్ – విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేక‌ర‌ణ పూర్తి
Advertisement

Komatireddy Venkatreddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో 280 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నిర్మాణం కానున్న నాగ్‌పూర్ - విజ‌య‌వాడ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకర‌ణ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌యిన‌ట్లు రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

శాస‌న‌మండ‌లిలో మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మీదుగా 280 కి.మీ మేర సాగే అత్యంత కీలకమైన నాగ్‌పూర్-విజయవాడ (మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా) గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఒక ఎక‌రం మిన‌హా భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ దాదాపు పూర్త‌యింద‌న్నారు. మిగిలిన చిన్న, చిన్న సమస్యలను కూడా పరిష్కరించి, NHAIతో సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ 2027 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) చేపట్టే నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా సహకరిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన రివ్యూ ఆధారంగా రోడ్డు పనుల వేగంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించి డిసెంబర్ 27 నాటికి హైవే పనులను పూర్తి చేస్తామ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement