త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | 2028 నాటికి బ్ర‌హ్మాండ‌మైన రోడ్లు : మంత్రి కోమ‌టిరెడ్డి

Komatireddy Venkat Reddy | 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలిచేలా హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు.

S

Telangana | Published On Mar 18, 2026, 2.09 pm IST

Komatireddy Venkat Reddy | 2028 నాటికి బ్ర‌హ్మాండ‌మైన రోడ్లు : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్ : 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలిచేలా హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రోడ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మనోహర్ రెడ్డి, పాల్వాయి హరీశ్​ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు.

ప్ర‌తి గ్రామానికి ర‌హ‌దారి ఏర్పాటు చేస్తాం. ప్ర‌తి పౌరుడి నివాసానికి రోడ్డు ఉన్న‌ప్పుడే నిజ‌మైన అభివృద్ధి. గ్రామాల నుంచి మండ‌లానికి బీటీ రోడ్డు, మండ‌లం నుంచి జిల్లా కేంద్రానికి డ‌బుల్ రోడ్డు ఉండాలి. దీంతో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి హ్యామ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 30 వేల కోట్ల‌తో టెండ‌ర్లు పిలిచాం. టెక్నిక‌ల్ బిడ్స్ ఓపెన్ చేశాం. ఏప్రిల్ 10 లోపు అగ్రిమెంట్స్ పూర్తి చేసి ప‌నులు ప్రారంభిస్తాం. 2028 జూన్ నాటికి దేశంలో ఎక్క‌డా కూడా తెలంగాణలాగా మోడ‌ల్ రోడ్లు ఉండ‌వు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా ముందుకు పోతున్నామ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

సంక్షేమ కార్య‌క్ర‌మాల మాదిరే రోడ్ల‌పై దృష్టి

రెగ్యుల‌ర్ బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉంది. గ‌త ప్ర‌భుత్వం బ‌కాయిలు ఎక్కువ‌గా ఉన్నాయి. కొద్దికొద్దిగా చెల్లిస్తూ ఎమ‌ర్జెన్సీ ప‌నులు చేశాం. మా ప్లాన్ ప్ర‌కారం ఆర్ అండ్ బీ శాఖ‌కు వ‌చ్చిన నిధులను కొన్ని మెడిక‌ల్ కాలేజీలు, కొన్ని ఆఫీసుల‌ను టేకాప్ చేశాం. గ‌త ప్ర‌భుత్వంలో క‌లెక్ట‌ర్ ఆఫీసులు క‌ట్టారు.. పేమెంట్స్ ఇవ్వ‌లేదు.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు క‌ట్టారు.. పేమెంట్ ఇవ్వ‌లేదు.. వీటికి పేమెంట్స్ ఇస్తున్నాం. హ్యామ్ ప్రాజెక్టుతో మీరు ఊహించ‌ని విధంగా బ్ర‌హ్మాండ‌మైన రోడ్లు రాబోతున్నాయి. జ‌న‌గామ‌తో మొద‌లుపెట్టుకుని అన్ని రోడ్ల‌ను పూర్తి చేస్తాం. సిద్దిపేట, గ‌జ్వేల్ రింగ్ రోడ్డుల‌ను పూర్తి చేస్తాం. రోడ్లు అభివృద్ధికి సూచిక‌లు. అమెరికా రిచ్ ఎందుకంటే అమెరికా రోడ్లు అద్భుత‌మ‌ని గ‌డ్క‌రీ చెబుతుంటారు. దానితోటే అభివృద్ధి జ‌రిగింది. సంక్షేమ కార్య‌క్ర‌మాల మాదిరే రోడ్ల‌పై దృష్టి పెట్ట‌డం జ‌రిగింది.

రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగ్

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరగుతుందని, ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే బీఆర్​ఎస్ సభ్యుడు హరీశ్​ రావు ఆరోపణలు మొదలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని మండిపడ్డారు.

నేను ఓపెన్‌గా మాట్లాడే వ్య‌క్తిని..

నేను తెలంగాణ ఉద్య‌మ‌కారుడిని. నాకు ప‌దవుల కంటే తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రం కోసం మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. నేను ఓపెన్‌గా మాట్లాడే వ్య‌క్తిని. స్వ‌ప‌క్ష‌మైనా, విప‌క్ష‌మైనా త‌ప్పు జ‌రిగితే ఒప్పుకోను అని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement