త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jemimah Rodrigues | జెమీమా రోడ్రిగ్స్‌కు గాయం.. ఆసియా క‌ప్ ఆడేది డౌటే!

Jemimah Rodrigues | భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ గాయం కారణంగా ది హండ్రెడ్‌ ఉమెన్స్‌ 2026 టోర్నీకి దూరమైంది. సదర్న్‌ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండ‌డం లేదు.

P

Sports | Published On Aug 8, 2026, 5.55 pm IST

Jemimah Rodrigues | జెమీమా రోడ్రిగ్స్‌కు గాయం.. ఆసియా క‌ప్ ఆడేది డౌటే!
Advertisement

Jemimah Rodrigues | భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ గాయం కారణంగా ది హండ్రెడ్‌ ఉమెన్స్‌ 2026 టోర్నీకి దూరమైంది. సదర్న్‌ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండ‌డం లేదు. ఆమె స్థానంలో ఆల్‌రౌండర్‌ చార్లీ నాట్‌ను సదర్న్‌ బ్రేవ్‌ జట్టు తీసుకుంది. ఈ టోర్నీలో జెమీమా మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 143 పరుగులు చేసింది. కీలక బ్యాటర్‌గా రాణిస్తున్న సమయంలో గాయపడడం సదర్న్‌ బ్రేవ్‌కు గట్టి దెబ్బగా మారింది.

ఆసియా కప్‌లో ఆడుతుందా?

జెమీమా గాయం ప్రభావం త్వరలో ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్‌పైనా పడే అవకాశం ఉంది. ఆగస్టు 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం నుంచి కోలుకోవడానికి జెమీమాకు ఇప్పుడు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఆసియా కప్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే జెమీమా స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రతికా రావల్‌, యాస్తికా భాటియా పేర్లు పరిశీలనలోకి తీసుకునే అవ‌కాశం ఉంది. భారత బ్యాటింగ్‌ విభాగంలో జెమీమా కీలక సభ్యురాలు కావడంతో ఆమె దూరమైతే జట్టుకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement