KCR | రేపు నర్సంపేటకు కేసీఆర్.. పెద్ది కుటుంబానికి పరామర్శ
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో, నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు అధినేత కేసిఆర్ గుండె ధైర్యం నింపి రానున్నారు.
పెద్ది కుటుంబానికి రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సాయం
పెద్ది కుటుంబానికి కేసీఆర్ కొండంత అండగా నిలిచి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పార్టీ తరఫున 2.25 కోట్ల రూపాయలను అందజేయాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నమ్మకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో, ఆయన కుటుంబ బాధ్యతలను పార్టీ తరఫున తామే చూసుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల పేరు మీద చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉండడంతో వారి బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలన్నారు. మొత్తంగా, 2.25 కోట్ల రూపాయలను పెద్ది కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలవాలని నిర్ణయించింది.
తాజావార్తలు
- ●Honey Trap | మహిళ వలపు వల.. పాక్ హ్యాండ్లర్ల చేతికి దేశ రక్షణ రహస్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్
- ●సాగర్ నిండినా చెరువులు నింపలేం..!
- ●IAS Fouzia Taranum | ముస్లిం అయినంత మాత్రాన 'పాకిస్థానీ' అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు
- ●Ponguleti Srinivas Reddy | డీలిమిటేషన్ సాకుతో మహిళలకు బీజేపీ ద్రోహం : మంత్రి పొంగులేటి
- ●Chanagani Dayakar | హరీశ్‌రావ్.. చెంపలేసుకొని నిరుద్యోగులకు సారీ చెప్పు
- ●Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాకు మించిన బడ్జెట్‌తో...

Honey Trap | మహిళ వలపు వల.. పాక్ హ్యాండ్లర్ల చేతికి దేశ రక్షణ రహస్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్

సాగర్ నిండినా చెరువులు నింపలేం..!

IAS Fouzia Taranum | ముస్లిం అయినంత మాత్రాన 'పాకిస్థానీ' అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు

Ponguleti Srinivas Reddy | డీలిమిటేషన్ సాకుతో మహిళలకు బీజేపీ ద్రోహం : మంత్రి పొంగులేటి




