Jupally Krishna Rao | మీరు ఏం చేస్తారో చెప్పండి.. 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తా.. కేటీఆర్, హరీశ్‌కు మంత్రి జూపల్లి సవాల్
Jupally Krishna Rao | బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. మీరు చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును ప్రశ్నించారు.
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. మీరు చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును (Harish Rao) ప్రశ్నించారు. రాతపూర్వంగా తన లేఖకు సమాధానం చెప్పాలన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు మాని, స్పష్టంగా మాట్లాడాలని హితవు పలికారు. ఏదేదో మాట్లాడి అసలు విషయానికి జవాబు చెప్పడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కేటీఆర్ అసత్యాలు చెబుతున్నారని వెల్లడించారు. పదేండ్లలో వారు చేసిన అప్పులపై తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ రూ.3 లక్షల కోట్లు అంటే, హరీశ్‌రావు రూ.4 లక్షల కోట్లు అని చెబుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్లు చేసిన అప్పులు తమ ప్రభుత్వానికి కాదని కేటీఆర్ చెబుతున్నారని, మరి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను రైతు కట్టాలా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా సేకరించిన రుణాలను రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్లు తాగేవాళ్లు చెల్లించాలా? అని నిలదీశారు. దీనికి కేటీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఎఫ్‌ఆర్‌బీఎం, గ్యారంటీడ్ లోన్లు, నాన్‌గ్యారంటీడ్ లోన్లు ఉంటాయని, మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు.
అప్పులపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తానని, మీరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చెప్పిన లెక్కలు తప్పని రుజువైతే.. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా, తన్నీరు పౌరుషమా తేల్చుకుందామని సవాల్ విసిరారు. తాను మాటమీద నిలబడే వ్యక్తినని స్పష్టం చేశారు. తోక ముడిచే వ్యక్తిని కాదని వెల్లడించారు. రింగురోడ్డు అమ్మితే వచ్చిన డబ్బును రైతు బంధుకు చెల్లించారని వివరించారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | కేసీఆర్ గారూ మేం ఎదగడం ఇష్టం లేదా..? మంత్రి పొన్నం వేడుకోలు
జులై 2, 2026

Harish Rao | అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను జడ్పీ చైర్మన్ చేసిందే మేమే : హరీశ్‌రావు
జులై 2, 2026

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్‌రావు
జులై 2, 2026
తాజావార్తలు
- ●DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
- ●Harish Rao | వ్యాట్సప్‌లో ప్రూఫ్స్ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్
- ●Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..
- ●Alia Bhatt | అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ - ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు
- ●LPG Tanker Explodes | డివైడర్‌ను ఢీకొట్టిన ఎల్పీజీ ట్యాంకర్.. గ్యాస్ లీకై భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. షాకింగ్ వీడియో
- ●Couple dies by suicide | ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

Harish Rao | వ్యాట్సప్‌లో ప్రూఫ్స్ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్

Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..

Alia Bhatt | అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ - ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు



