Harish Rao | అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను జడ్పీ చైర్మన్ చేసిందే మేమే : హరీశ్‌రావు
Harish Rao | ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్( Adluri Laxman Kumar ) ను గతంలో జడ్పీ చైర్మన్‌ను చేసింది మేమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు( Harish Rao ) గుర్తు చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్( Adluri Laxman Kumar ) ను గతంలో జడ్పీ చైర్మన్‌ను చేసింది మేమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు( Harish Rao ) గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు గురువారం మీడియాతో మాట్లాడారు.
అడ్లూరి లక్ష్మణ్ అంటే మాకు చాలా గౌరవం.. మొదటిసారిగా ఆయన జడ్పీ చైర్మన్ అయినప్పుడు నేనే ఇంచార్జిగా ఉండి లక్ష్మణ్‌ను జడ్పీ చైర్మన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే, కేసీఆర్ ఆదేశిస్తే నేను దగ్గరుండి ఆయనను జడ్పీ చైర్మన్‌ను చేశాను. చేసినా అంటే పార్టీ బాధ్యతను నిర్వర్తించాను అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
లక్ష్మణ్ కుమార్ నిజంగా దళితబిడ్డగా దళితులకు న్యాయం చేయాల్సి ఉండే. మఫత్‌లాల్ కంపెనీకి, గుజరాత్‌కు ఆర్డర్లు ఇవ్వొద్దు.. దళిత బిడ్డలం మేం బతుకుతాం.. ఆర్డర్లు గతంలో మాకే ఇచ్చారు బాగా చేశామని అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు దళితులు లేఖ రాశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కూడా లేఖ రాశారు. ఈ ఆర్డర్లు గత 10 ఏండ్ల నుంచి మేమే చేస్తున్నామని మాకే ఇప్పించండని పరిశ్రమల మంత్రిని కూడా దళిత బిడ్డలు వేడుకున్నారు. పీఎంయూ చైర్మన్‌కు కూడా మంత్రుల కంటే ముందు కూడా లేఖ రాశారు. ఇది మా స్వయం ఉపాధి.. దళిత బిడ్డల నోరు కొట్టకండి అని వేడుకున్నారు. సీఎస్‌కు కూడా లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తున్నారు.. టెండర్లుకు పోవొద్దు.. లిడ్ క్యాప్ ద్వారా దళిత బిడ్డలుకు ఇవ్వాలని ఈ జీవో ప్రకారం టెండర్లు ఇవ్వడం తప్పని మా హక్కులు కాపాడాలని లేఖ రాశారు. దళిత మంత్రి, పరిశ్రమల మంత్రి, సీఎస్, పీఎంయూ చైర్మన్ పట్టించుకోలేదు. దళిత బిడ్డల రోదన అరణ్య రోదనగా మారిపోయింది అని హరీశ్‌రావు తెలిపారు.
దళిత బిడ్డల 90 శాతం నోరు కొట్టారు..
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు దళిత బిడ్డలు. జస్టిస్ రేణుకా యార దళితుల పక్షాన నిలబడి వారి హక్కులు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. గత ప్రభుత్వ జీవో ప్రకారం వారికే టెండర్లు దక్కాలని కోర్టు చెప్పింది. ఇప్పటికే టెండర్లు వేశారని, 10 శాతం దళితులకు ఇచ్చి 90 శాతం కమీషన్లు ఇచ్చే గుజరాత్ కంపెనీకి కట్టబెట్టారు. మా దళిత బిడ్డల 90 శాతం నోరు కొట్టారు. అవకతవకలు జరగలేదని ఎస్సీ మంత్రి అంటున్నారు. హైకోర్టు రక్షణ కల్పిస్తే 10 శాతం ఆర్డర్లు వచ్చాయి. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్, అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టారు. దళితులకు కేసీఆర్ రక్షణ కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. మరి చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాకి ఎత్తుకుపోయిందా..? అని హరీశ్‌రావు నిలదీశారు.
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



