Couple dies by suicide | ఘట్‌కేసర్‌లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
Couple dies by suicide | మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఏమైందో ఏమో కానీ ఇద్దరు దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
త్రినేత్ర.న్యూస్: మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఏమైందో ఏమో కానీ ఇద్దరు దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ప్రకారం విరాలిలా ఉన్నాయి. పాపాయిపేటకు చెందిన రవికుమార్, శిరీష దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం హయత్‌నగర్ సమీపంలో ఉన్న కుంట్లూరులో ఉంటున్నారు. కాగా ఉన్నట్టుండి గురువారం రాత్రి ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్‌ఎఫ్‌సీ సమీపంలో ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్



