Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
Jupally Krishna Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) అధికారులను ఆదేశించారు.
ఊరు వాడలా సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలి
బతుకమ్మ ఏర్పాట్లపై అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఊరు వాడలా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ విభాగాల అధిపతులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రి సూచించారు. ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని, ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేసి బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగేలా చూడాలని, ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వారసత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
- ●Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే
- ●Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు
- ●Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదంటున్నవ్.. టైమిస్తే అందర్ని తోల్కొనొస్తా
- ●Talasani Srinivas Yadav | రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు.. ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..

Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే

Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు




