Palamuru Lift Irrigation | పాలమూరు ఎత్తిపోతల.. బాహుబలి మోటార్లు ప్రారంభం
Palamuru Lift Irrigation | ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం
చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం
గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు?
నిలదీసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Palamuru Lift Irrigation | త్రినేత్ర న్యూస్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు భారీ బాహుబలి మోటార్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయకుండానే.. దీన్ని జాతికి అకింతం చేశారని, కానీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఇతర పనులను గత ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. ప్రాజెక్టును గత పాలకులు పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని ద్వజమెత్తారు.
రాజకీయ ప్రచారానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు
మహాత్మాగాంధీ–కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.60 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, కోయిలాసాగర్ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ఇన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ ప్రచారానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదో
రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన గత పాలకులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదో ప్రజలకు వివరించాలని నిలదీశారు. రైతాంగానికి సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం ప్రాజెక్టుల పురోగతిపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం మేరకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల వారీగా సమస్యలను గుర్తించి, పనుల పురోగతిని సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jailer 2 | ‘జైలర్ 2’పై తగ్గిన బజ్.. బాక్సాఫీస్ వద్ద రజనీ మ్యాజిక్ పనిచేసేనా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్..
- ●Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?
- ●Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి

Jailer 2 | ‘జైలర్ 2’పై తగ్గిన బజ్.. బాక్సాఫీస్ వద్ద రజనీ మ్యాజిక్ పనిచేసేనా?

Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్..

Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు

Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..




