Damodar Raja Narasimha | ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
Damodar Raja Narasimha | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఏసీలు పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఐదుగురు పసికందులు బలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర సమీక్ష
Damodar Raja Narasimha | త్రినేత్ర న్యూస్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఏసీలు పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఐదుగురు పసికందులు బలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అన్ని హెల్త్ ఫెసిలిటీస్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌ల నిర్వహణ, హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, వాటిని సరిదిద్దే చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్‌ను కూడా రెగ్యులర్‌గా చేపిస్తున్నామని అధికారులు వివరించారని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్ ఆడిట్లలో గుర్తించిన అంశాలు, తీసుకున్న చర్యలను సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్న చోట తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హెల్త్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sabarimala Crown Row | శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?
- ●Ranbir Kapoor | రెట్రో లుక్‌లో రణభీర్‌కపూర్ - లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ షురూ
- ●Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
- ●Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్
- ●Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Sabarimala Crown Row | శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?

Ranbir Kapoor | రెట్రో లుక్‌లో రణభీర్‌కపూర్ - లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ షురూ

Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ - చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్





