Kranthi Kiran | సింగూర్‌ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే
Kranthi Kiran | నిండు కుండలాంటి సింగూరు ప్రాజెక్టును రిపేర్ల నెపంతో ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) దేనని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైరయ్యారు.
- సాగు, తాగు నీటి కోసం తండ్లాడేటట్టు చేసిన పాపం ఆయనదే
- 4 రూపాయల కరెంటు వదులుకొని.. 15 రూపాయలకు పాకులాట
- రైతులకు కరెంటివ్వని కాంగ్రెస్ గద్దె దిగాలే
- అన్నాసాగర్ సబ్‌స్టేషన్ రైతల ధర్నాలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజం
Kranthi Kiran | త్రినేత్ర న్యూస్: నిండు కుండలాంటి సింగూరు ప్రాజెక్టును రిపేర్ల నెపంతో ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) దేనని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైరయ్యారు. రైతులకు కరెంటు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలన్నారు. నాలుగు రూపాయల కరెంటు కొనే అవకాశం ఉన్నా.. 15 రూపాయలు పెట్టి కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పాకులాడుతోందని ఆరోపించారు. తెలివి లేని సీఎం.. బుర్ర తక్కువ మంత్రులతో రాష్ట్ర పాలన భ్రష్టుపట్టిందని దుయ్యబట్టారు. మంగళవారం ఆందోళ్ మండలం అన్నాసాగర్ సబ్ స్టేషన్ వద్ద రైతులు నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన పాల్గొన్న అనంతరం ప్రసంగించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటదని ముందే హెచ్చరికలున్నా పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అసమర్థ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల జలాలను ఒడిసిపట్టకుండా సముద్రం పాలు చేశారని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల పాటు నిరంతరాయంగా వచ్చిన నాణ్యమైన విద్యుత్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేశారన్నారు. గతంలో యూనిట్ రూ.4 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలున్నా వదులుకొని, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ.15 పెట్టి కొనేందుకు ప్రయత్నించడం వీరి అవినీతి, అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. అందుకే రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి అని ఎద్దేవా చేశారు.
స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ వైఖరిని క్రాంతి కిరణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ, నిండుకుండలా కళకళలాడుతున్న సింగూర్ ప్రాజెక్టు నీళ్లను గేట్ల రిపేర్ల నెపంతో కిందికి వదిలేసి ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకుండా ఖాళీ చేయించి, నేడు ఆందోల్ నియోజకవర్గ రైతాంగాన్ని సాగునీరు, తాగునీటికి తండ్లాడేలా చేసిన పాపం ముమ్మాటికీ మంత్రి దామోదరదేనని నిప్పులు చెరిగారు. ఎండిన పంట పొలాలను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించాలన్నారు. నష్టపోయిన రైతులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కౌలు ఎట్లా కట్టాలంటూ రైతుల కన్నీళ్లు..
ఈ ధర్నాలో ఆందోల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు నడవక, పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని అన్నదాతలు ఏకరువు పెట్టారు. ఎకరానికి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే పైర్లు ఎండిపోతుంటే, ఇప్పుడు భూ యజమానులకు కౌలు ఎలా చెల్లించాలని కౌలు రైతులు గుండెలు బాదుకున్నారు. కాంగ్రెస్ పాలన వద్దంటూ నినాదాలు చేస్తూ రోడ్డుకు రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. డీఈ ఘటనా స్థలానికి వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపేవరకు కదిలేది లేదంటూ రహదారిపై ధర్నాకు దిగారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఆందోల్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మాసంపల్లి నారాయణ, లింగాగౌడ్ లతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, రైతు నాయకులు, ఆందోల్ మండల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
- ●L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
- ●Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్
- ●Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...
- ●Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి

DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్







