TGSWRJC CET | సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
TGSWRJC CET | సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల (TGSWRJC CET) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) ఫలితాలు విడుదల చేశారు.
TGSWRJC CET | త్రినేత్ర.న్యూస్: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల (TGSWRJC CET) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) ఫలితాలు విడుదల చేశారు. మొదటి విడతలో 18,401 విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఈనెల 15న నిర్వహించిన ప్రవేశపరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో 19,740 సీట్లు ఉన్నాయి.
ఎంపికైన అభ్యర్థులు జూన్ 7లోపు కాలేజీల్లో చేరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు డైట్ చార్జీలు కూడా పెంచిందన్నారు. ప్రతినెల మొదటివారంలో నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సాంఘిక సంక్షే విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నేడు ఈసెట్ ఫలితాలు
డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ (TG ECET) ఫలితాలు మరో మూడు గంటల్లో విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.ecet.thche.ac.inలో చూసుకోవచ్చు.
ఈ నెల 15న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు 18,626 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 17,870 (95.94శాతం) హాజరయ్యారు.
సంబంధిత వార్తలు

Adluri Lakshman | పదేండ్లు రాజ్యాధికారం అనుభవించి.. అహంకారంతో మాట్లాడుతున్నారు.. కేటీఆర్, హరీశ్‌పై మంత్రి అడ్లూరి ఫైర్
ఏప్రిల్ 23, 2026

Municipal Elections | ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఫిబ్రవరి 13, 2026

Municipal Election Results | మధ్యాహ్నంలోపు మున్సిపల్ ఫలితాలు.. ఒకే రౌండ్లో అలంపూర్ రిజల్ట్
ఫిబ్రవరి 13, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



