MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
MLA Premsagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన జన్మదిన వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, విప్ విజయరమణ రావు సమక్షంలోనే ఎంపీ వంశీకృష్ణపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
- చేతుల్లేపే పరిస్థిస్తోస్తే గంజాయి బ్యాచే కాదు మనుషులు కూడా కనవడరు
- అధిష్టానం మాట విని వంశీకృష్ణను పార్లమెంట్‌కు పంపినం
- ఇప్పుడేమో ఎమ్మెల్యేలకు తెల్వకుండా నియోజకవర్గాలకు వచ్చిపోతుర్రు
- చీమల దండు కదిలింది.. మా తెర్వొస్తే తొక్కుడే
- ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు
MLA Premsagar Rao | త్రినేత్ర.న్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన జన్మదిన వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, విప్ విజయరమణ రావు సమక్షంలోనే ఎంపీ వంశీకృష్ణపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని.. కానీ ఇప్పుడు వారే మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. చేత్తుల్లేపే పరిస్థిస్తోస్తే గంజాయ్ బ్యాచే కాదని మనుషులు కూడా కనవడరని వార్నింగ్ ఇచ్చారు. చీమల దండు కదిలిందని.. వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా అని మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
దళిత కార్డు పేరుతో మంత్రి, ఎంపీలు కాంగ్రెస్ క్యాడర్‌ను అణగదొక్కుతున్నరు. అధిష్టానం మాట విని గెలిపిచ్చి పార్లమెంట్‌కు పంపించినం. మేం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం కాబట్టి పార్టీ హైకమాండ్ మాట ధిక్కరించకుండా మనసు సంపుకొని చేస్తే ఈరోజు ఎంత క్షోభ అనుభవిస్తున్ననో నా మనసుకు తెల్సు. ఈరోజు మాట్లాడితే దళితులు అంటున్నరు. ఏ ఎమ్మెల్యేల దగ్గరకొచ్చినా కూడా ఏ ఎమ్మెల్యేకు చెప్పేదుండదు.. ఎమ్మెల్యేకు సంబంధం ఉండదు. ఎవరో పనికిరాని బ్యాచ్ పెట్టుకొని తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీని అవమానించే పని చేస్తున్నరు.
అట్ల చేయకుంటే రాజీనామా చేసి పోతా..
దళితుల మద్దతు ఎవరికుందో ఈరోజు ఈ సభ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక నెల రోజులు సమయం ఇస్తా. మీరు ఎంతమంది దళితులను తీసుకొచ్చి పెడతరో మీటింగ్ పెట్టండి. దాని తర్వాత పది ఇరవై రోజుల టైం ఇవ్వండి రూపాయి ఇయ్యకుండా మీటింగ్ పెట్టకపోతే ఇదే వేదిక నుంచి రాజీనామా చేసి పోతా.
దళితుల పేరు చెప్పుకొని దళితులను అవమానం చేయడం కాదు. వేదిక మీదున్నోళ్లు, కిందున్నోళ్లు ఏవిధమైన క్షోభ అనుభవిస్తున్నరో చూస్తుర్రు మీరంతా. మళ్లొక్కసారి చెప్తున్నా.. చీమల దండు కదిలింది. నేన్ రాజకీయాలకొచ్చింది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు. 10 సంవత్సరాలుగా అందరిని కలుపుకొని పోతున్నా. కష్టకాలంలో ఎవరున్నా లేకున్నా పని చేసిన.
నాకెంత బాధైతుందో నా మన్సుకే తెల్సు..
ఇయ్యాళ్ల కచ్చితంగా చెబుతున్నా. ఎవరైతే గంజాయి బ్యాచ్ మంచిర్యాల పట్టణంల ఉందో.. చీమల దండు కదిలింది.. వట్టిగ కాలేసి తొక్కుతే సచ్చిపోతరు బిడ్డా చెప్తున్నా. మళ్లొక్కసారి వార్నింగ్ ఇస్తున్నా. చేతులు లేపే పరిస్థితి తీసుకురాకండి. చేతుల్లేపే పరిస్థిస్తోస్తే ఈ ప్రాంతంల గంజాయి బ్యాచ్‌యే కాదు మనుషులు కూడా కనవడరు. ఈరోజు ఇట్ల మాట్లాడుతున్నా అంటే ఎంత బాధైతుందో నాక్ తెలుసు. ప్రతి చోట నరకం చూస్తున్నా. ఆరోగ్యం బాలేక నా పని నేన్ చేసుకుంట పోతున్నా.
ఒక్కటి గుర్తు పెట్టుకొర్రి..
ప్రతిదానికి దళిత కార్డు అంటున్నరు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకొర్రి. ఈ అధికారం వ్యవస్థ ఉంటది పోతది. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మాకున్న అనుబంధంతో సహా ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మోస్తరు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తరు. కానీ ఎవరన్నా తిరుగుబాటు చేసి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం తొక్కుడే. ఉద్యమాల గడ్డ ఇది.. తొక్కుడు మాకొస్తది. గంజాయి బ్యాచ్‌ను రూపుమాపుతం. మంచిర్యాలలో పిల్లలకు ఏ సమస్య రాకుండా, కుటుంబాలు నాశనం కాకుండా చూసే బాధ్యత మాది. శపథం చేస్తున్నా అని ప్రేమ్‌సాగర్‌రావు వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ●Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్

RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు



