త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MIM MLAs | శాస‌న‌స‌భ‌లో వందేమాత‌రం ఆలాప‌న‌.. ఎంఐఎం ఎమ్మెల్యేల నిష్క్ర‌మ‌ణ‌

MIM MLAs | గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం మ‌ళ్లీ మొద‌ట‌గా తెలంగాణ రాష్ట్ర గీతం ఆల‌పించారు. ఆ త‌ర్వాత వందేమాత‌రం ప్రారంభం కాగానే.. ఎంఐఎం పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌భ నుంచి నిష్క్ర‌మించారు. ఈ దృశ్యం శాస‌న‌స‌భ లైవ్ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

S

Telangana | Published On Mar 16, 2026, 1.20 pm IST

MIM MLAs | శాస‌న‌స‌భ‌లో వందేమాత‌రం ఆలాప‌న‌.. ఎంఐఎం ఎమ్మెల్యేల నిష్క్ర‌మ‌ణ‌
Advertisement

MIM MLAs | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభయ స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు. అయితే ప్ర‌సంగం ప్రారంభానికి ముందుగా తెలంగాణ గీతం, వందేమాత‌రం.. చివ‌ర‌గా జ‌ణ‌గ‌న‌మ‌ణ ఆల‌పించారు. త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉద‌యం 11.50 గంట‌ల‌కు ప్రారంభ‌మై.. మ‌ధ్యాహ్నం 12.50 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం మ‌ళ్లీ మొద‌ట‌గా తెలంగాణ రాష్ట్ర గీతం ఆల‌పించారు. ఆ త‌ర్వాత వందేమాత‌రం ప్రారంభం కాగానే.. ఎంఐఎం పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌భ నుంచి నిష్క్ర‌మించారు. ఈ దృశ్యం శాస‌న‌స‌భ లైవ్ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

అయితే ఎంఐఎం పార్టీ త‌ర‌పున తొలిరోజు కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ గీతం ముగిసిన వెంట‌నే కొంద‌రు ఎంఐఎం స‌భ్యులు నిష్క్ర‌మించారు. ఇక వందేమాత‌రం ప్రారంభం కాగానే ఉన్న మ‌రో న‌లుగురు స‌భ్యులు కూడా స‌భ నుంచి వెళ్లిపోయారు. ఎంఐఎం స‌భ్యులు వెళ్తున్న త‌రుణంలో.. బీజేపీ ఎమ్మెల్యేలు వారి వైపు చూస్తూ.. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్లు క‌నిపించింది.

Advertisement
Advertisement