త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఇంట‌ర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్న భోజ‌నం..! కేబినెట్ ఆమోదం

Telangana | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజనం ప‌థ‌కం అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది.

S

Telangana | Published On May 23, 2026, 7.31 pm IST

Telangana | ఇంట‌ర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్న భోజ‌నం..! కేబినెట్ ఆమోదం
Advertisement

గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 1000 కోట్లు..!
తొలి విడుత‌గా రూ. 300 కోట్లు విడుద‌ల‌..
కేబినేట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజనం ప‌థ‌కం అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఇంట‌ర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్నం భోజ‌నం ప‌థ‌కం అమ‌లు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలేజీ ప్రారంభ‌మైన తొలి రోజే నుంచే ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. మ‌ధ్యాహ్నం భోజ‌నం ప‌థ‌కం అమ‌లుతో పాటు ఉద‌యం అల్పాహారం, పాలు అందించాల‌ని నిర్ణ‌యించింది. స‌చివాల‌యంలో శ‌నివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రెండోసారి జ‌ర‌గ‌బోయే గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 1000 కోట్లు కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో 2027లో జ‌రిగే గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 1000 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడ‌త‌గా రూ. 300 కోట్ల నిధుల‌ విడుదల‌కు కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది.

కేబినెట్ నిర్ణ‌యాలు మ‌రిన్ని..

  • కేసముద్రం ఫైర్‌స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు.
  • అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్‌ జిల్లాలో 14 ఎక‌రాలు.. వెలిదిలో 4, రుక్మాపూర్‌లో 5, గ‌న్నేరువ‌రం మండ‌లంలో 5 ఎక‌రాలు కేటాయింపు.
  • గంగాధరలో నూతన డిగ్రీ కళాశాలలో పలు పోస్టుల మంజూరు.. 20 రెగ్యులర్ టీచింగ్, 6 నాన్‌టీచింగ్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు ఆమోదం.

ముగ్గురు మంత్రులు గైర్హాజ‌రు..!

సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కేబినెట్ స‌మావేశానికి ముగ్గురు మంత్రులు హాజ‌రు కాలేదు. మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, వివేక్, అజారుద్దీన్ మంత్రివ‌ర్గ స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

Advertisement
Advertisement