త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pharma City | ఆ ఆర్డీవోపై చ‌ర్య‌లు తీసుకోండి.. ఫార్మా సిటీ వ్య‌తిరేక క‌మిటీ ఫిర్యాదు

Pharma City | రంగారెడ్డి జిల్లా నానక్‌నగర్ గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవోపై జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవోతో పాటు రెవెన్యూ సిబ్బంది అక్ర‌మంగా త‌మ భూముల‌ను స్వాధీనం చేసుకుంటూ.. చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌లు, కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతున్నారంటూ జిల్లా క‌లెక్ట‌ర్‌కు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On May 23, 2026, 6.03 pm IST

Pharma City | ఆ ఆర్డీవోపై చ‌ర్య‌లు తీసుకోండి.. ఫార్మా సిటీ వ్య‌తిరేక క‌మిటీ ఫిర్యాదు
Advertisement

Pharma City | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా నానక్‌నగర్ గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవోపై జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవోతో పాటు రెవెన్యూ సిబ్బంది అక్ర‌మంగా త‌మ భూముల‌ను స్వాధీనం చేసుకుంటూ.. చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌లు, కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతున్నారంటూ జిల్లా క‌లెక్ట‌ర్‌కు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు.

ఆర్డీవోపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాన‌క్‌న‌గ‌ర్ రైతులు చ‌ల్ల ల‌క్ష్మారెడ్డి, చ‌ల్ల రాంరెడ్డి ఇచ్చిన విన‌తిప‌త్రం కాపీని ఆర్డీవో కార్యాల‌యం ఇన్వార్డ్ సెక్ష‌న్‌లో ఇవ్వ‌గా.. ఇది మేం తీసుకోం. ఫార్మా సిటీ గురించి ఇచ్చే ఏ విన‌తి ప‌త్రాన్ని కూడా తీసుకోవ‌ద్ద‌ని ఆర్డీవో త‌మ‌ను ఆదేశించార‌ని అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. చ‌ట్టం ప్ర‌కారం ఏ ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనైనా విన‌తిప‌త్రాలు, ఫిర్యాదులు తీసుకోవాలి. కానీ ఇబ్ర‌హీంప‌ట్నం డివిజ‌న్ ఆర్డీవో కార్యాల‌యంలో అన్ని కొత్త నిబంధ‌న‌లు పెడుతున్నారు. అది కేవ‌లం ఫార్మా సిటీ రైతుల కోసం మాత్ర‌మే..! ఇదేనా ప్రజా పాలన, ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే రాజ్యాంగ రక్షణ అని ఫార్మా సిటీ వ్య‌తిరేక క‌మిటీ నిల‌దీసింది.

Advertisement
Advertisement