US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఛాన్స్ ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.
International | Published On May 23, 2026, 10.30 pm IST
US Iran Ceasefire | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) గడువును మరో రెండు నెలల పాటు (60 రోజులు) పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం (Peace deal) ముసాయిదా దాదాపు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఇరాన్ (Iran) అగ్ర నాయకత్వంతో వరుస భేటీలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శాంతి దిశగా పావులు.. ఇరాన్‌లో పాక్ ఆర్మీ చీఫ్ టూర్
ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్‌లతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అత్యంత కీలక చర్చలు జరిపారు. ఈ 'షార్ట్ అండ్ ప్రొడక్టివ్' టూర్‌తో పాక్ (Pakistan) తనను తాను ఈ శాంతి చర్చల్లో (Peace talks) ప్రధాన మధ్యవర్తిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
త్వరలోనే డీల్.. కానీ ఇరాన్ వార్నింగ్
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో (Marco Rubio) కూడా ఈ డీల్‌పై పాజిటివ్‌గా స్పందించారు. శాంతి ఒప్పందం దిశగా 'స్వల్ప పురోగతి' (slight progress) సాధించామని, త్వరలోనే డీల్ ఒకే అయ్యే ఛాన్స్ ఉందని ఆయన హింట్ ఇచ్చారు. అయితే, ఇరాన్ మాత్రం ఇంకా అమెరికాతో చాలా విభేదాలు ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ యుద్ధం (War) మొదలుపెడితే, తమ నుంచి 'కఠినమైన దెబ్బ' (crushing response) తప్పదని ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ గాలిబాఫ్ గట్టిగా హెచ్చరించారు. పైగా, ఈ కాల్పుల విరమణ సమయంలో తమ సాయుధ బలగాలను పూర్తిగా 'రీబిల్ట్' (rebuilt) చేసుకున్నామని ఆయన ప్రకటించారు.
ఇరాన్ పెట్టిన కండిషన్లు ఏంటి?
ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక ఆఫర్ పంపింది. అయితే ఇందులో ట్రంప్ గతంలో రిజెక్ట్ చేసిన డిమాండ్లే మళ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన హార్ముజ్ జలసంధిపై (Strait of Hormuz) పూర్తిగా కంట్రోల్ తమకే ఉండాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కోరింది. ఫ్రీజ్ చేసిన తమ ఆస్తుల విడుదల, అలాగే మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ (US troops withdrawal) వంటి భారీ షరతులను ఇరాన్ ఈ డ్రాఫ్ట్‌లో పెట్టింది.
ప్రపంచానికి ముప్పుగా 'హార్ముజ్' జలసంధి క్లోజింగ్!
యుద్ధానికి బ్రేక్ పడినా.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' ఇంకా తెరుచుకోలేదు. ప్రపంచంలోని 20% చమురు (Oil), లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఈ దారి ఇలాగే మూసి ఉంటే, రాబోయే నెలల్లో తీవ్రమైన "గ్లోబల్ ఫుడ్ ప్రైస్ క్రైసిస్" (ఆహార ధరల సంక్షోభం) వస్తుందని UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఏప్రిల్ 17న కుదిరిన కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, హెజ్బొల్లాను (Hezbollah) టార్గెట్ చేస్తూ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్ (Airstrikes) చేస్తూనే ఉంది. తాజాగా సిరియా సరిహద్దుల్లో ఐదు దాడులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trump Brilliant Tyrant Dictator | నన్ను ‘డిక్టేటర్’ అనండి, కానీ ‘డంబ్’ అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
మే 23, 2026

Marco Rubio India Visit | అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ భేటీ.. ఆసక్తికరంగా మారిన ‘వైట్ హౌస్’ ఆహ్వానం
మే 23, 2026

Stock Markets | అమెరికా స్టాక్ మార్కెట్లలో జోష్.. డౌ రికార్డ్ హై..
మే 23, 2026
తాజావార్తలు
- ●Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
- ●Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
- ●Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం
- ●Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్
- ●Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!

Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం



