త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్‌.. హెచ్‌సీఏ నిర్ణ‌యం

HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్ జ‌రుగ‌నున్న‌ది. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర స్థాయి టీ20 ఫార్మాట్‌లో ఈ లీగ్‌ను నిర్వహించేందుకు హెచ్‌సీఏ కార్యాచరణ ప్రారంభించింది.

P

Telangana | Published On May 23, 2026, 9.30 pm IST

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్‌.. హెచ్‌సీఏ నిర్ణ‌యం
Advertisement

HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్ జ‌రుగ‌నున్న‌ది. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర స్థాయి టీ20 ఫార్మాట్‌లో ఈ లీగ్‌ను నిర్వహించేందుకు హెచ్‌సీఏ కార్యాచరణ ప్రారంభించింది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. జూన్ 20న ప్రారంభ మ్యాచ్ జరగనుండగా, జూలై 11న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల పేర్లతో జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ ఫ్రాంచైజీలను వివిధ సంస్థలు దక్కించుకున్నాయి.

హైదరాబాద్ జట్టును ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.7.5 కోట్లకు సొంతం చేసుకోగా, రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్‌ఫ్రా ప్రణవ రూ.7.2 కోట్లకు దక్కించుకుంది. వరంగల్ జట్టును బైన్ గ్లోబల్ రిసోర్సెస్ రూ.6.55 కోట్లకు, మెదక్ జట్టును బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.6.33 కోట్లకు కొనుగోలు చేశాయి. నల్గొండ ఫ్రాంచైజీని కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.5.06 కోట్లకు తీసుకోగా, కరీంనగర్ జట్టును ఈఐపీఎల్ గ్రూప్ (తిబరుమల్) రూ.4.57 కోట్లకు దక్కించుకుంది. మహబూబ్‌నగర్ జట్టును వీరభద్ర స్టీల్స్ రూ.4.5 కోట్లకు, ఖమ్మం జట్టును అన్విత గ్రూప్ రూ.4.44 కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, జట్ల ఎంపిక అనంతరం ఆటగాళ్ల వేలం ప్రక్రియను జూన్ 7న నిర్వహించనున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది.

Advertisement
Advertisement