Ameenpur | అమీన్‌పూర్‌లో వ్యక్తి అరెస్ట్.. 45 తులాల ఆభరణాలకు బాధితులకు అప్పగించిన పోలీసులు
Ameenpur | అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో బాధితులకు అప్పగించారు.
Ameenpur | అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో బాధితులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామ్ నాయక్ తండాకు చెందిన మండల్లా శివ అలియాస్ ఎర్ర శివ (32) ప్రస్తుతం మీర్‌పేట్‌లోని భూపేష్ గుప్తా కాలనీలో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం సుమారు 18 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తాపీ మేస్త్రి వద్ద కూలీ పనులు చేసేవాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు కూలీ పనితో వచ్చే ఆదాయం సరిపోక దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.
మల్కాజిగిరి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో పలు చోరీలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్టు వెల్లడించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో చర్లపల్లి జైలులో రెండు నెలలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైనట్లు తెలిపారు. నిందితుడిపై మొత్తం 24 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అందులో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 కేసులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 9 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ రెండో వారంలో అమీన్‌పూర్, బందం కొమ్ము ప్రాంతాల్లో అర్థరాత్రి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాడ్ల సహాయంతో లోపలికి ప్రవేశించి బీరువాల తాళాలు పగులగొట్టి డైమండ్, బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు విచారణలో తేలింది.
అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు చోరీ కేసుల్లో శివ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను కోర్టు అనుమతితో శుక్రవారం మీడియా సమక్షంలో బాధితులు వెంకటరమణ, భవానీ దంపతులకు రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ ఎస్ఐ పీ నరేశ్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జీ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం
- ●Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్
- ●Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్
- ●Allu Arjun | ఐకాన్ స్టార్‌ను కలిసిన ఆర్సీబీ క్రికెటర్ - ఫొటోలు వైరల్
- ●Renukaswami Case | జైలులో హీరో దర్శన్ ఆత్మహత్య ప్రయత్నం అంటూ వార్తలు.. ఖండించిన హోం మంత్రి..!
- ●Raghav Chadha | రాఘవ్ చద్దాకు ప్రమోషన్: రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా నియామకం.. సభ్యులు వీరే!

HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం

Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్

Mouni Roy | తల్లి వయసు 40 - కొడుక్కి 39 ఏళ్లు - మౌనీరాయ్ బాలీవుడ్ మూవీపై నెటిజన్ల ట్రోల్

Allu Arjun | ఐకాన్ స్టార్‌ను కలిసిన ఆర్సీబీ క్రికెటర్ - ఫొటోలు వైరల్




