త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiran Abbavaram | వ‌ద‌ల‌నే అంటోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం – అచ్చ తెలుగు బ్యూటీతో ల‌వ్ సాంగ్

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన చెన్నై ల‌వ్‌స్టోరీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు ర‌వి నంబూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చెన్నై ల‌వ్‌స్టోరీ సెకండ్ సింగిల్‌ను మే 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On May 23, 2026, 9.04 pm IST

Kiran Abbavaram | వ‌ద‌ల‌నే అంటోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం – అచ్చ తెలుగు బ్యూటీతో ల‌వ్ సాంగ్
Advertisement

Kiran Abbavaram | ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ యంగ్ హీరోగా కొన‌సాగుతోన్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ప్ర‌స్తుతం ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఏడాది ఓ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే చెన్నైల‌వ్‌స్టోరీకితో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ర‌వి నంబూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న‌ ఈ సినిమాలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ల‌ర్ ఫొటో, బేబీ సినిమాల డైరెక్ట‌ర్ సాయిరాజేష్ నిర్మాత ఎస్‌కేఎన్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సెకండ్ సింగిల్‌...

చెన్నై ల‌వ్‌స్టోరీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను మే 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌ద‌ల‌నే అంటూ ఎమోష‌న‌ల్ ల‌వ్ సాంగ్‌గా ఈ సెకండ్ సింగిల్ ఉండ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. చెన్నై ల‌వ్‌స్టోరీ మూవీకి మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందిస్తోన్నారు. సాయిరాజేష్ ఈ సినిమాకు క‌థ‌ను అందించారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లో మ‌రో డిఫ‌రెంట్ మూవీగా చెన్నై ల‌వ్‌స్టోరీ ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. జూలైలో ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

టాలీవుడ్ బ్యూటీ...

మ్యాడ్ త‌ర్వాత శ్రీ గౌరి ప్రియ న‌టిస్తోన్న తెలుగు మూవీ ఇది. ఈ టాలీవుడ్ బ్యూటీకి తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ట్రూ ల‌వ‌ర్‌, హ్యాపీరాజ్ సినిమాల‌తో త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

 

Advertisement
Advertisement