CSR Funds | పాఠశాలల అభివృద్ధికి సీఎస్సార్ నిధులు.. బడుల రూపురేఖలు మార్చేదిశగా కీలక ఒప్పందాలు..!
CSR Funds | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ సంస్థలు రాష్ట్ర విద్యా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
CSR Funds | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ సంస్థలు రాష్ట్ర విద్యా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖతో ఒప్పంద పత్రాలు అధికారికంగా మార్చుకున్నారు. కార్యక్రమానికి విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఛైర్మన్ సీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ ఒప్పందాల ప్రకారం.. పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, కొత్త తరగతి గదుల నిర్మాణం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా సౌకర్యాల విస్తరణకు భారీగా నిధులు వినియోగించనున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు కొత్త ప్రాంగణ అభివృద్ధికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం అంటే రూ.19.66 కోట్లు రాంకీ ఫౌండేషన్ భరించనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధి కోసం ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి, అలాగే ఇంటర్మీడియట్ వరకు తరగతుల నిర్మాణానికి అవసరమైన వ్యయంలో 40 శాతం అంటే రూ.10.4 కోట్లు రాంకీ సంస్థ భరించనుంది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యా సదుపాయాల విస్తరణ కోసం మొత్తం రూ.50.50 కోట్ల వ్యయాన్ని రహేజా గ్రూప్ భరించనుంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్‌నగర్ ఎంపీపీఎస్‌లో ప్రీ ప్రైమరీ, 6వ, 7వ తరగతుల అభివృద్ధి కోసం అవసరమైన రూ.12.20 కోట్లను యశోధ ఫౌండేషన్ ఖర్చు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దడం, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ ఒప్పందాలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!
- ●Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
- ●US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
- ●Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే
- ●HCA | తొలిసారిగా టీజీ20 క్రికెట్ లీగ్.. హెచ్‌సీఏ నిర్ణయం
- ●Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం - అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్

Delhi Gymkhana Club Eviction | ఎలైట్ ఎంపైర్‌కు ఎండ్ కార్డ్: ఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు.. జూన్ 5 డెడ్‌లైన్!

Trump Brilliant Tyrant Dictator | నన్ను 'డిక్టేటర్' అనండి, కానీ 'డంబ్' అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్

Telangana Cabinet Decisions | ఇందిరమ్మ ఇండ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, పుష్కరాలకు నిధులు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాల పూర్తి వివరాలివే





