MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి
MP Chamala, Jupally | భువనగిరి కోటను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న రోప్ వే పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
- భువనగిరి కోట రోప్ వే పనుల పరిశీలనలో మంత్రి జూపల్లి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచన
MP Chamala, Jupally | త్రినేత్ర.న్యూస్: భువనగిరి కోటను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న రోప్ వే పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన భువనగిరి కోటను సందర్శించి మాట్లాడారు. కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
రోప్ వే పనుల పరిశీలన పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడే భువనగిరి ఖిల్లా రోప్ వే (Ropeway) పనుల ప్రగతిని వారు ప్రత్యేకంగా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోట పరిసరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పర్యాటక రంగ అభివృద్ధి పనులను, మౌలిక వసతులను వారు పరిశీలించారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఆధునిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేలా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

అంతకుముందు భువనగిరికి చేరుకున్న పర్యాటక శాఖ మంత్రికి, ఎంపీకి స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Instagram | ఇన్స్టాగ్రామ్ క్యారసెల్ పోస్టులకు భారీ అప్డేట్.. ప్రతి స్లైడ్‌కు ప్రత్యేక క్యాప్షన్..
- ●Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్
- ●Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు - క్లారిటీ ఇచ్చిన టీమ్
- ●World Giraffe Day | ప్రపంచ జిరాఫీ దినోత్సవం.. హైదరాబాద్ జూలో 'బన్నీ' బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Saudi Arabia Vs Spain | స్పెయిన్ చేతిలో సౌదీ అరేబియా చిత్తు
- ●Kiara Advani | టాక్సిక్ వర్సెస్ వాన్ - భర్తతో కియారా అద్వానీ బాక్సాఫీస్ వార్

Instagram | ఇన్స్టాగ్రామ్ క్యారసెల్ పోస్టులకు భారీ అప్డేట్.. ప్రతి స్లైడ్‌కు ప్రత్యేక క్యాప్షన్..

Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్

Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు - క్లారిటీ ఇచ్చిన టీమ్

World Giraffe Day | ప్రపంచ జిరాఫీ దినోత్సవం.. హైదరాబాద్ జూలో 'బన్నీ' బర్త్‌డే సెలబ్రేషన్స్





