Chamala Kiran Kumar Reddy | ప్రజల జీవితాలు కేటీఆర్‌కు సినిమాలా కనపడుతున్నాయ్: ఎంపీ చామల
Chamala Kiran Kumar Reddy | ప్రజల జీవితాలు కేటీఆర్‌కు (KTR) సినిమాలా కనపడుతున్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్లతో అంటకాగిన కేటీఆర్.. రాజకీయంలో సినిమా మాటాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రజల జీవితాలు కేటీఆర్‌కు (KTR) సినిమాలా కనపడుతున్నాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్లతో అంటకాగిన కేటీఆర్.. రాజకీయంలో సినిమా మాటాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఏమైనా సూపర్ హిట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రెండున్నరేండ్ల పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
మీది షోలే సినిమా కాదు.. హౌలే సినిమా..
`సీఎం రేవంత్ రెడ్డి విజన్‌తో ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో విద్య, వైద్యం, రైతులకు మేలు చేసేలా సీఎం రేవంత్ ముందుకు పోతున్నారు. ముఖ్యమంత్రిపై బావ,బామ్మర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పదేండ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్లతో అంటకాగిన కేటీఆర్.. రాజకీయంలో సినిమా మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల జీవితాలు ఆయనకు సినిమాలాగా కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా...? కేటీఆర్. మీ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులపాలైంది. మీ పదేండ్ల పాలన షోలే సినిమా కాదు.. హౌలే సినిమా.
పాఠశాలలు నిర్వీర్యం..
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి క్రాప్ డైవర్షన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం అత్యధిక దిగుబడి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణ వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీకి ఎగ్జిట్ ఇచ్చి మెట్రో ఫెజ్ 2ను పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించండి, కలిసి అభివృద్ధిలో ముందుకు పోదాం అని ముఖ్యమంత్రి అంటున్నారు. మెట్రో ఫెజ్-2పై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నది.
కేటీఆర్ భాద్యతతో ప్రజల కోణంలో మాట్లాడాలి. హైడ్రా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా కీలకంగా మారింది. నాళాలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టాలని హైడ్రా భావిస్తున్నదా..?. నగరం ముంపునకు గురికాకుండా కీలక పాత్ర పోషిస్తున్నది. బీజేపీ ఓట్ చోరీ, సీట్ చోరీ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు?. కేటీఆర్, హరీష్ రావు చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు.` అని ఎంపీ చామల మండిపడ్డారు.
[video width="576" height="1024" mp4="https://static.trinethra.news/wp-content/uploads/2026/06/kirankumar.mp4"][/video]
తాజావార్తలు
- ●MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి
- ●SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..
- ●Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి

SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..

Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం





