Medaram Jatara | మేడారం హుండీ ఆదాయం రూ.13.25 కోట్లు.. గత జాతరతో సమానం!
Medaram Jatara | రెండేండ్లకోసారి నిర్వహించే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక సంబురం మేడారం మహాజాతర (Medaram Jatara) గత నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన విషయం తెలిందే.
Medaram Jatara | త్రినేత్ర.న్యూస్: రెండేండ్లకోసారి నిర్వహించే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక సంబురం మేడారం మహాజాతర (Medaram Jatara) గత నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన విషయం తెలిందే. కోటిన్నరకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించుకున్న కానుకలు, హుండీ ఆదాయాన్ని ఫిబ్రవరి 5 నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. బుధవారంతో లెక్కింపు పూర్తయింది.

వారం రోజులపాటు మొత్తం 828 హుండీలను లెక్కించగా రూ.13,25,83,269 ఆదాయం లభించింది. విదేశీ కరెన్సీ, రద్దు చేసిన నోట్లు, వెండి బంగారు ఆభరణాలు కూడా హుండీల్లో లభించాయని అధికారులు తెలిపారు. మొత్తం 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యావేక్షణలో లెక్కించారని వెల్లడించారు. కాగా, రెండేండ్ల క్రితం నిర్వహించిన జాతరలో కూడా రూ.13.25 కోట్ల ఆదాయమే రావడం విశేషం. 2024 జాతరలో 13,25,22,511 ఆదాయం వచ్చింది. ఈ సారి రూ.60 వేల అదనంగా వచ్చాయి.

అయితే గత జాతరలో 540 హుండీలను ఏర్పాటు చేయగా, ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేశారు. దాదాపు 288 హుండీలను అదనంగా ఉన్నప్పటికీ గత జాతరతో సమానంగా ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు కూడా వచ్చాయి.
రోజువారీగా వచ్చిన ఆదాయం వివరాలు..
- ఫిబ్రవరి 5: రూ. 2,49,65,000 (125 హూండీలు)
- ఫిబ్రవరి 6: రూ. 3,54,25,200 (160 హూండీలు)
- ఫిబ్రవరి 7: రూ. 2,01,21,440 (140 హూండీలు)
- ఫిబ్రవరి 8: రూ. 2,64,75,757 (200 హూండీలు)
- ఫిబ్రవరి 9: రూ. 1,12,63,000 (163 హూండీలు)
- ఫిబ్రవరి 10: రూ. 80,81,935 (40 హూండీలు)
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



