HCU | హెచ్‌సీయూలోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ.. రూ.25 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు మాయం
HCU | గచ్చిబౌలి (Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) పరిధిలోని ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ (C.R.Rao Advanced Institute)లో భారీ చోరీ జరిగింది.
HCU | గచ్చిబౌలి (Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) పరిధిలోని ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ (C.R.Rao Advanced Institute)లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించిన ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు.
ఇన్‌స్టిట్యూట్‌లోని ఓ క్లాస్‌రూమ్ కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించిన ఆగంతకులు.. సుమారు 50 ల్యాప్‌టాప్‌లను (Laptops) ఎత్తుకెళ్లిపోయారు. వాటి విలువ దాదాపు రూ.25 లక్షలకుపైనే ఉంటుందని సమాచారం. ఇవాళ ఉదయం చోరీ వ్యవహారాన్ని గుర్తించిన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ల్యాప్‌టాప్‌లను కారులో తరలించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపడుతున్నారు.
తాజావార్తలు
- ●Drumstick Business | మునగకాయల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువకుడు
- ●Minister Vivek | లేబర్ కోడ్లపై తొందరపాటు నిర్ణయాలు ఉండవ్ : మంత్రి వివేక్ వెంకటస్వామి
- ●Sreeleela | అల్లు అర్జున్ రాకాలో క్రేజీ బ్యూటీ - ఊహించని కాంబినేషన్ సెట్టయ్యిందా?
- ●Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు
- ●Somashila | సోమశిలలో 1,600 ఎకరాల్లో రిక్రియేషన్ హబ్ : మంత్రి జూపల్లి
- ●Minister Seethakka | ఎల్ నినో ముప్పు ఉన్నా.. గుక్కెడు నీటికి గోస రానివ్వం

Drumstick Business | మునగకాయల వ్యాపారం.. ఏడాదికి రూ. 2.25 కోట్లు సంపాదిస్తున్న యువకుడు

Minister Vivek | లేబర్ కోడ్లపై తొందరపాటు నిర్ణయాలు ఉండవ్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

Sreeleela | అల్లు అర్జున్ రాకాలో క్రేజీ బ్యూటీ - ఊహించని కాంబినేషన్ సెట్టయ్యిందా?

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు






