META | గచ్చిబౌలి మెటా ఆఫీస్ ముట్టడి
META | జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్, జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి మణిశర్మ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ శ్రేణులు గచ్చిబౌలిలోని మెటా కార్యాలయాన్ని ముట్టడించాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టాయి.
META | జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్, జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి మణిశర్మ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ శ్రేణులు గచ్చిబౌలిలోని మెటా కార్యాలయాన్ని ముట్టడించాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న మెటా సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా, కోట్లాది మంది వినియోగించే సోషల్ మీడియా వేదికలను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.
బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా మెటా సంస్థ వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని మండిపడ్డారు. మెటా సంస్థ తన అప్రజాస్వామిక చర్యలను తక్షణమే నిలిపివేసి, నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మెటా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న జక్కిడి శివచరణ్‌రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే





