త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అవ‌స‌ర‌మైన‌ప్పుడు మౌనంగా ఉండి.. ప్ర‌చార ఆర్భాటం కోసం సిగ్గులేకుండా రాష్ట్రానికి వ‌స్తున్నారు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్‌

KTR | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్రజ‌లు సమస్యలు ఎదుర్కొన్న‌ప్పుడు, ఆందోళనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్న రాహుల్.. ఇప్పుడు ప్రజాధనం రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటాల కోసం రాష్ట్రానికి వస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

G

Telangana | Published On Nov 13, 2026, 11.35 am IST

KTR | అవ‌స‌ర‌మైన‌ప్పుడు మౌనంగా ఉండి.. ప్ర‌చార ఆర్భాటం కోసం సిగ్గులేకుండా రాష్ట్రానికి వ‌స్తున్నారు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌స‌భ‌లో విప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్రజ‌లు సమస్యలు ఎదుర్కొన్న‌ప్పుడు, ఆందోళనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్న రాహుల్.. ఇప్పుడు ప్రజాధనం రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటాల కోసం రాష్ట్రానికి వస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఉద్యోగాల కోసం ఆందోళ‌న చేస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Govt) పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి, అణచివేసినప్పుడు ఎక్క‌డున్నార‌ని ప్రశ్నించారు. భూముల కోసం లగచర్ల (Lagacharla) గిరిజన మహిళలపై దాడులు చేసి, వారి దుస్తులు తొల‌గించి వేధింపుల‌కు గురిచేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎందుకు స్పందించలేని నిల‌దీశారు. సామాన్య ప్ర‌జ‌లు కష్టప‌డి క‌ట్టుకున్న ఇండ్ల‌ను బుల్డోజ‌ర్ల‌తో హైడ్రా (HYDRAA) కూల్చివేస్తున్నప్పుడు ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కంచ గచ్చిబౌలిలో హెచ్‌సీయూ (HCU) భూముల్లో రాత్రికి రాత్రే 10 వేలకు పైగా చెట్లను నరికివేసి వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేసినప్పుడు, కేబీఆర్ పార్కు విధ్వంసం సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వ‌హించార‌ని మండిప‌డ్డారు.

రాజ్యాంగ ప్ర‌క్రియ‌ల‌ను అప‌హాస్యం చేస్తూ 10 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్న‌ప్పుడు పట్టించుకోలేదని విమ‌ర్శించారు. అసెంబ్లీ ఎదుట మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, వారిపై దాడి చేసిన ఘటనపై కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్ర‌శ్నించారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, నేతన్నల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, భూకబ్జాలపై రాహుల్ మౌనం వహించారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రభుత్వంలోని అవినీతిపై (Corruption) బహిరంగంగా మాట్లాడుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు మౌనాన్ని ఆశ్రయించి, ఇప్పుడు తెలంగాణ ప్రజల రూ.100 కోట్ల సొమ్ముతో ప్రచార ఆర్భాటం కోసం సిగ్గులేకుండా రాష్ట్రానికి వస్తున్నారు.. అస‌లు మీకు ఆ హ‌క్కు ఎక్క‌డిది రాహుల్ గాంధీ? అంటూ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement