త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Marriages | శుభ ఘ‌డియ‌లు వ‌చ్చేశాయ్.. 16 నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!

Marriages | ఓ నెల రోజుల పాటు ఆగిపోయిన పెళ్లిళ్ల‌కు( Marriages ), గృహ ప్ర‌వేశాల‌కు మ‌ళ్లీ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అధిక జ్యేష్ట మాసంతో ఆగిన శుభ‌ముహుర్తాలు.. మ‌ళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.

S

Telangana | Published On Jun 16, 2026, 7.32 am IST

Marriages | శుభ ఘ‌డియ‌లు వ‌చ్చేశాయ్.. 16 నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!
Advertisement

Marriages | త్రినేత్ర‌.న్యూస్ : ఓ నెల రోజుల పాటు ఆగిపోయిన పెళ్లిళ్ల‌కు( Marriages ), గృహ ప్ర‌వేశాల‌కు మ‌ళ్లీ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అధిక జ్యేష్ట మాసంతో ఆగిన శుభ‌ముహుర్తాలు.. మ‌ళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 16 నుంచి ప్రారంభం కానున్న నిజ జ్యేష్ట శుద్ధ పాడ్య‌మి నుంచి బ‌హుళ త్ర‌యోద‌శి జులై 12 వ‌ర‌కు సుముహూర్తాలు ఉన్న‌ట్లు వేద పండితులు తెలిపారు.

ఈ నెల రోజుల పాటు నిశ్చితార్థాలు, వివాహాలు జరుపుకోవడంతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేప‌ట్టేందుకు శుభ స‌మ‌యం అని పేర్కొన్నారు. పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయం. రెండు, మూడు నెలల ముందే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న వారు ప్రస్తుతం కల్యాణ మండపాలు మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యారు.

మొత్తానికి మ‌ళ్లీ నెల రోజుల పాటు ఫంక్ష‌న్ హాల్స్ క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి. పెళ్లిళ్ల‌ల‌కు, ఇత‌ర శుభ కార్య‌క్ర‌మాల‌కు రాక‌పోక‌లు సాగించే వారితో బ‌స్సులు కూడా కిట‌కిట‌లాడ‌నున్నాయి. ఈ నెల 20, 25 తేదీల్లో కొన్ని వేల పెళ్లిళ్లు ఉన్న‌ట్లు పండితులు పేర్కొంటున్నారు.

శుభ తేదీలు ఇవే..

జూన్‌లో : 16, 17, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28,

జులైలో : 1, 6, 7, 8, 10, 11, 12

Advertisement
Advertisement