త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భ‌ర్త‌ల‌ను అదుపులో పెడుతార‌ట‌..! మ‌రి మీ రాశి ఉందా..?

Zodiac Signs | హిందూ సంప్ర‌దాయంలో భార్యాభ‌ర్త‌ల బంధానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. సంసార జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ప్ర‌తి నిత్యం దంప‌తులు అన్యోన్యంగా ఉంటూ క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. అయితే కొంత మంది భ‌ర్త‌లు భార్య‌ల‌పై ఆధిప‌త్యం చెలాయిస్తుంటారు. కొంద‌రేమో కొంగుచాటు భ‌ర్త‌లుగా మిగిలిపోతారు.

S

Devotional | Published On Aug 18, 2026, 7.03 am IST

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భ‌ర్త‌ల‌ను అదుపులో పెడుతార‌ట‌..! మ‌రి మీ రాశి ఉందా..?
Advertisement

Zodiac Signs | హిందూ సంప్ర‌దాయంలో భార్యాభ‌ర్త‌ల బంధానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. సంసార జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ప్ర‌తి నిత్యం దంప‌తులు అన్యోన్యంగా ఉంటూ క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. అయితే కొంత మంది భ‌ర్త‌లు భార్య‌ల‌పై ఆధిప‌త్యం చెలాయిస్తుంటారు. కొంద‌రేమో కొంగుచాటు భ‌ర్త‌లుగా మిగిలిపోతారు. అంటే భార్య మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌డం.. వారి అదుపులోనే ఉండ‌డం, వారి క‌నుస‌న్న‌ల్లోనే సంసారాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఈ నాలుగు రాశుల వారు భ‌ర్త‌ల‌ను అదుపులో పెట్టే భార్య‌లు అని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సింహ రాశి ( Leo )

సింహ రాశికి చెందిన స్త్రీలు మంచి హృద‌యాన్ని క‌లిగి ఉంటార‌ట‌. భ‌ర్త‌కు ఎలాంటి క‌ష్టం రాకుండా భార్య‌లు చూసుకుంటార‌ట‌. నిత్యం భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తూ సంసారాన్ని చ‌క్క‌బెట్టుకుంటార‌ట‌. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం భార్య‌లు.. భ‌ర్త‌ల‌కు స‌హ‌క‌రిస్తార‌ట‌. ఈ రాశి మ‌హిళ‌ల‌ను పురుషులు పెళ్లాడితే ఎంతో అదృష్ట‌మ‌ని పండితులు చెబుతున్నారు.

ధనస్సు రాశి ( Sagittarius )

ఇక ధ‌న‌స్సు రాశి అమ్మాయిలు చాలా అందంగా ఉండి.. పురుషుల‌ను ఆక‌ర్షిస్తార‌ట‌. అందం క‌లిగే ఉండ‌డ‌మే కాకుండా.. పెళ్లాడిన మొగుడిని ఎంతో బాధ్య‌త‌గా చూసుకుంటార‌ట‌. త‌మ అదుపులో ఉంచుకుని.. అన్ని ప‌నులు చ‌క్క‌బెట్టుసుకుంటార‌ట‌. దంప‌తులిద్ద‌రూ అన్యోన్యంగా ఉంటూ.. సంసార జీవితంలో ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తార‌ట‌.

కుంభ రాశి ( Aquarius )

కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారట.

మీన రాశి( Pisces )

మీన రాశి అమ్మాయిల‌కు కొంచెం మాట‌లు ఎక్కువ‌.. ఆ మాట‌ల‌తోనే మ‌గాళ్ల‌ను క‌ట్టిపడేస్తార‌ట‌. తమ మాటలతోనే అందరినీ మాయ చేస్తార‌ట‌. అంతే కాకుండా తమ భర్తలను కూడా మాటలతోనే మాయ చేసి తమ చుట్టూ తిప్పుకుంటార‌ట‌. కానీ భర్తకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటార‌ట‌. అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తార‌ట‌.

 

Advertisement
Advertisement