Lord Ganesha | కలలో గణనాథుడితో పాటు ఎలుక కనిపిస్తే.. శుభమా..? అశుభమా..?
Lord Ganesha | మీకు కలలో గణనాథుడు( Lord Ganesh ) కనిపించాడా..? వినాయకుడితో పాటు ఎలుక కూడా కనిపించిందా..? మరి ఇది దేనికి సంకేతం.. శుభమా..? అశుభమా..? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Devotional | Published On Sep 15, 2026, 6.43 am IST
Lord Ganesha | హిందూ సంప్రదాయంలో గణనాథుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. విఘ్నాలు తొలగించే దైవంగా.. ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అందుకే ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా గణనాథుడిని పూజిస్తారు. ఆ తర్వాతే ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. జీవితంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. మరి అదే గణనాథుడు కలలో కనిపిస్తే శుభమా..? అశుభమా..? అనే విషయాలను కూడా తెలుసుకుందాం.
లంబోదరుడిని పూజిస్తున్నట్లు కల వచ్చిందా..?
ప్రస్తుతం గణేశ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళ గణనాథుడు పూజలు అందుకుంటారు. మరి ఈ సందర్భంలో భక్తులకు ఎవరికైనా వినాయకుడు పూజలు అందుకుంటున్నట్టు కల వస్తే.. శుభప్రదంగా భావించాలి. ఇలాంటి కల వచ్చిన వారు భవిష్యత్‌లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున గణేశుడు కలలో కనిపిస్తే మరింత శుభప్రదంగా భావిస్తారు. బప్పా అనుగ్రహంతో మీ కోరికల్లో ఏదో ఒకటి నెరవేరబోతోందనే నమ్మకం ఉంది.
గణనాథుడికి విగ్రహం కలలో కనిపించిందా..?
గణనాథుడి విగ్రహం కలలో కనిపించినా కూడా శుభప్రదంగానే భావించాలి. ఈ విధంగా కల వస్తే.. ఆ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. చాలా కాలం పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.
వినాయకుడితో పాటు ఎలుక కనిపిస్తే..?
గణేశుడి వాహనమైన ఎలుకతో పాటు గణపతి కలలో కనిపించడం కూడా శుభసంకేతంగా భావిస్తారు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర ప్రయత్నాల్లో విజయానికి సూచనగా, అలాగే ఆర్థికంగా లాభాలు కలగడానికి సంకేతంగా చెబుతారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ …. వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్
సెప్టెంబర్ 14, 2026

Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్
సెప్టెంబర్ 14, 2026

Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●KTR | శభాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్
- ●Murder | హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య
- ●Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని నష్టాలు..!
- ●కేసీఆర్ ‘పదేళ్లు’.. కేటీఆర్ ‘పాదయాత్ర’.. హరీశ్ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?
- ●VinayakaChavithi | అత్తింట్లో రష్మిక - కొడుకుతో అల్లు అర్జున్ - స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్
- ●Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు

KTR | శభాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్

Murder | హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య

Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని నష్టాలు..!

కేసీఆర్ ‘పదేళ్లు’.. కేటీఆర్ ‘పాదయాత్ర’.. హరీశ్ ‘ప్రజా పోరాటం’.. గులాబీ త్రిసూత్రం ఇదేనా?



