Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..
Sangareddy | భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అలకలు, చిరాకులు సహజమే. భార్య తనతో మాట్లాడటం లేదని, భర్త తనకు నచ్చిన సీరియల్ చూడనీయడం లేదని.. చిన్నచిన్న కారణాలకే దంపతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Sangareddy | త్రినేత్ర.న్యూస్: భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అలకలు, చిరాకులు సహజమే. భార్య తనతో మాట్లాడటం లేదని, భర్త తనకు నచ్చిన సీరియల్ చూడనీయడం లేదని.. చిన్నచిన్న కారణాలకే దంపతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి (Sangareddy) జిల్లా పుల్కల్ మండలంలో జరిగింది. భార్య తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ (Mobile Number Block) చేయడంతో అవమానంగా భావించిన భర్త బలవన్మరణం చెందారు.
పుల్కల్ మండలంలోని మీన్‌పూర్ గ్రామానికి చెందిన చిట్కల హనుమంతు (29), కొన్యాలకు చెందిన అలివేణి మంగతో ఇటీవల వివాహం జరిగింది. ఈ నెల 21న ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమెకు పదేపదే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుకుంటున్నాడు. ఇలా భర్త చేస్తుండటంతో విసుగు చెందిన భార్య.. అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో (Blacklist) పెట్టింది. తాను ఫోన్ చేస్తున్నా కలవకపోవడంతో.. తన అన్న బాలయ్య నంబర్ నుంచి అలివేణి మంగకు హనుమంతు ఫోన్ చేశాడు. బాలయ్య ఫోన్ ఎత్తిన అలివేణిమంగ అదే పనిగా ఫోన్ చేస్తుండటంతో భర్త నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టానని చెప్పింది.

తన నంబర్‌ను బ్లాక్‌లో పెట్టడం అవమానంగా భావించిన హనుమంతు ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొద్దుపోతున్నా గదిలో నుంచి హనుమంతు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే దూలానికి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే
అక్టోబర్ 3, 2026

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
సెప్టెంబర్ 26, 2026

Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



