Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. కూకట్‌పల్లిలో భారీ వాన
Rain | హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, ఎర్రగడ్డ, బోయిన్ పల్లి, మారేడుపల్లి, రాణిగంజ్, ఎంజీ రోడ్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
Rain | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, ఎర్రగడ్డ, బోయిన్ పల్లి, మారేడుపల్లి, రాణిగంజ్, ఎంజీ రోడ్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గచ్చిబౌలి, మణికొండ, టోలిచౌకి, మేడ్చల్‌లోనూ ఎడతెరిపిలేకుండా వాన పడుతున్నది. ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌లో జల్లులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కూకట్‌పల్లిలో (Kukatpally) అత్యధికంగా 78.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సఫిల్‌గూడలో 75.3 మి.మీ., షేక్‌పేట 67.3, చర్లపల్లి 63, బోరబండ 62.8, మాదాపూర్ 54.3, ఏఎస్ రావ్ నగర్ 54.3, కేపీహెచ్‌బీ, మల్కాజ్‌గిరిలో 48 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. గత పదేండ్లలో నవంబర్ నెలలో ఇంత భారీ వర్షపాతం నమోదుకావడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. కాగా,రానున్న ఒకటి, 2 గంటల్లో పటాన్‌చెరూ, ఆర్సీ పురం, అమీన్‌పూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, బాలాగనర్, ఖైదరాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
5 జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో శుక్రవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (నవంబర్ 28) నుంచి వర్షాలు ఊపందుకుంటాయని తెలిపింది. డిసెంబర్ 1 వరకు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని పేర్కొంది.
HEAVIEST NOVEMBER RAINS for Hyderabad City in last 10 years 🔥🌧️🌧️
What a night it has been for Hyderabad City with few parts recording 60-80mm rainfall
Heavy rains after 28days
#HyderabadRains https://t.co/Yir5pZ6zsl
— Telangana Weatherman (@balaji25_t) November 27, 2026
తాజావార్తలు
- ●Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..
- ●Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!

HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..






