Chalo Lok Bhavan | సేవ్ డెమొక్రసీ.. చలో లోక్‌భవన్ ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు
Chalo Lok Bhavan | ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నిర్వహిస్తున్న `చలో లోక్‌భవన్`(Chalo Lok Bhavan) ర్యాలీ కొనసాగుతున్నది. ‘సేవ్ డెమొక్రసీ’ (Save Democracy) పేరుతో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.
Chalo Lok Bhavan | త్రినేత్ర న్యూస్: ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నిర్వహిస్తున్న `చలో లోక్‌భవన్`(Chalo Lok Bhavan) ర్యాలీ కొనసాగుతున్నది. ‘సేవ్ డెమొక్రసీ’ (Save Democracy) పేరుతో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామి, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్నారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రాజ్‌భవన్ వైపు ర్యాలీ కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు

Malreddy Ranga Reddy | ఆ ఎమ్మెల్యేకు గుడ్ టచ్ ఏదో.. బ్యాడ్ టచ్ ఏదో కాస్త నేర్పించడయ్యా
అక్టోబర్ 8, 2026

OBC Census | ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణ.. బీజేపీ సర్కారుకు బీసీ సంఘాల హెచ్చరిక
అక్టోబర్ 8, 2026

Former Judges Write Open Letter | ఈసీని అస్థిరపరిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు.. నిరసనల వేళ ఈసీకి మద్దతుగా రిటైర్డ్ జడ్జీలు
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Malreddy Ranga Reddy | ఆ ఎమ్మెల్యేకు గుడ్ టచ్ ఏదో.. బ్యాడ్ టచ్ ఏదో కాస్త నేర్పించడయ్యా
- ●US Green Card Suspension | భారత ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్ షాక్: TCS, ఇన్ఫోసిస్, విప్రోలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ రద్దు
- ●Mudigonda Sivaprasad | చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ ఇకలేరు!
- ●Balanagar Road Accident | ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం: స్కూటీపై పడ్డ ఇనుప పైపుల లోడ్.. వాహనదారుడు స్పాట్ డెడ్
- ●KTR | జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రెండురోజులు దశాబ్ది ఉత్సవాలు : కేటీఆర్
- ●Vijay-Kangana | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ, కంగనా.. అసలు ఏం జరిగిందంటే..?

Malreddy Ranga Reddy | ఆ ఎమ్మెల్యేకు గుడ్ టచ్ ఏదో.. బ్యాడ్ టచ్ ఏదో కాస్త నేర్పించడయ్యా

US Green Card Suspension | భారత ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్ షాక్: TCS, ఇన్ఫోసిస్, విప్రోలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ రద్దు

Mudigonda Sivaprasad | చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ ఇకలేరు!

Balanagar Road Accident | ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం: స్కూటీపై పడ్డ ఇనుప పైపుల లోడ్.. వాహనదారుడు స్పాట్ డెడ్



