Mahankali Bonalu in Dubai | దుబాయ్‌లో మహంకాళి బోనాల మహోత్సవం.. వెల్లివిరిసిన తెలంగాణ వైభవం
Mahankali Bonalu in Dubai | దుబాయ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్ అల్‌ఖైమా మైత్రి ఫార్మ్స్‌లో ఆదివారం వైభవంగా నిర్వహించారు.
- ETCA ఆధ్వ ర్యంలో బోనాల సమర్పణ
- ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణం ఆవిష్కృతం
- పెద్ద సంఖ్యలో తరలొచ్చిన తెలంగాణ ప్రవాసులు
Mahankali Bonalu in Dubai | త్రినేత్ర.న్యూస్: దుబాయ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్ అల్‌ఖైమా మైత్రి ఫార్మ్స్‌లో ఆదివారం వైభవంగా నిర్వహించారు. విదేశీ నేలపై నిర్వహించిన ఈ వేడుకకు యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షారాా, అజ్మిన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా తదితర ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ETCA ఆధ్వర్యంలో వరుసగా నాలుగోసారి నిర్వహించారు. ఈ కార్యక్రమం గౌరమ్మ పూజతో ప్రారంభమైంది. అనంతరం మహంకాళి అమ్మవారిని సుందరంగా అలంకరించి మంత్రోచ్చరణల మధ్య దీప ప్రజ్వలన చేశారు. ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన, మహా హారతులు అందించారు. భక్తులు నైవేద్య సమర్పణలు, ఒడి బియ్యం, జిల్లేడు ఆకులు, ఎర్ర చీరలు, బెల్లం తదితర సంప్రదాయ కానుకలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

అనంతరం నిర్వహించిన బోనాల ఊరేగింపు ఆద్యాంతం కనువిందుగా నిలిచింది. ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద వాయిద్యాల సందడితో ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన దీపోత్సవం భక్తులకు ఆకట్టుకుంది. అనంతరం మహా ప్రసాదం పంపిణీ చేసి తెలంగాణ వంటకాలతో మహా అన్నదానం నిర్వహించారు.
ఈ వేడుకలకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తున్న ఈటీసీఏ సభ్యులను అభినందించారు.
ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీశ్ రావు మాట్లాడుతూ.. యూఏఈలో ఉంటున్న తెలంగాణ ప్రవాసులకు, ముఖ్యంగా విదేశాల్లో పుట్టినవారికి ఈ సంప్రదాయాలు, పండగల గొప్పదనాన్ని పరిచయం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ఎల్ఎస్‌పీఎంకే గ్రూప్ చైర్మన్ రాధారపు సత్యం, ఫొటోగ్రఫీ, వీడియో సేవలు అందించిన లెమన్ స్టూడియో రమేశ్, విరాళాలు అందించిన సభ్యులు, వాలంటీర్లు, కళాకారులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈటీసీఏ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షులు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, ఎస్‌పీ కస్తూరి, సురేశ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు ఎలిగేటి, రాము కందుకూరి, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్ పోలంపల్లి, కిరణ్ చెట్టిగారి, సారిక పీచర, మమత కస్తూరి, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, వనజ గోగుల, రనీషా, స్వప్న, దీపిక తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






