Heavy Rains | నేటి నుంచి 6 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Heavy Rains | రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం (జూన్ 22) నుంచి ఈ నెల 27 వరకు పలు జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం (జూన్ 22) నుంచి ఈ నెల 27 వరకు పలు జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, ములుగు, నల్లగొండ, కొత్తగూడెం, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :21-06-2026 pic.twitter.com/SG0jxFzeiv
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 21, 2026
తాజావార్తలు
- ●Egypt vs New Zealand | 92 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌కు తొలి విజయం
- ●Mallikarjun Kharge | యూజ్లెస్ ఫెలోస్.. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖర్గే ఆగ్రహం
- ●Yoga | యోగా వేడుకల్లో 4 వేల మందికిపైగా ఖైదీలు..
- ●Shiv Sena UBT | మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ శిండే వర్గంలో చేరనున్న శివసేన యూబీటీ ఎంపీలు..
- ●Horoscope | జూన్ 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విందు వినోదాలలో పాల్గొంటారు!
- ●Figure AI | మనుషుల కంటే రోబోలే ఎక్కువ.. ఆ ఏఐ కంపెనీలో సంచలనం! భయపెడుతున్న సీఈవో కామెంట్స్

Egypt vs New Zealand | 92 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌కు తొలి విజయం

Mallikarjun Kharge | యూజ్లెస్ ఫెలోస్.. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖర్గే ఆగ్రహం

Yoga | యోగా వేడుకల్లో 4 వేల మందికిపైగా ఖైదీలు..

Shiv Sena UBT | మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ శిండే వర్గంలో చేరనున్న శివసేన యూబీటీ ఎంపీలు..






