Krishank | మైనంపల్లికి సన్ స్ట్రోక్ ఉంది.. ఆయనకు మానసిక చికిత్స కూడా అవసరం
Krishank | మైనంపల్లి హనుమంతరావుకు సన్ స్ట్రోక్ ఉందని.. ఆయనకు మానసిక చికిత్స కూడా అవసరమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి ఏక్ నంబర్ అయితే, కాంగ్రెస్ నేతలు దస్ నంబర్ గాళ్లు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- కాంగ్రెస్ నేతలు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారు
- రేవంత్ రెడ్డి ఏక్ నంబర్, కాంగ్రెస్ నేతలు దస్ నంబర్ గాళ్లు
- కంటోన్మెంట్‌లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనంపల్లి అనుచరులు కబ్జాకు యత్నించారు
- ఆయన ఎప్పుడు, ఎక్కడికి వస్తారో చెప్పాలి
- మీడియా సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు
Krishank | త్రినేత్ర.న్యూస్: మైనంపల్లి హనుమంతరావుకు సన్ స్ట్రోక్ ఉందని.. ఆయనకు మానసిక చికిత్స కూడా అవసరమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి ఏక్ నంబర్ అయితే, కాంగ్రెస్ నేతలు దస్ నంబర్ గాళ్లు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంటోన్మెంట్‌లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనంపల్లి అనుచరులు కబ్జాకు యత్నించారని ఆరోపించారు. దీనిపై చర్చించేందుకు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో టైమ్,ప్లేస్ చెప్పాలని సవాల్ విసిరారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మైనంపల్లి గతంలో నగర బహిష్కరణకు గురి అయ్యారు. మైనంపల్లికి మానసిక చికిత్స చేయాలి. 2014లో ఒకే రోజు మూడు పార్టీలు మారారు. మైనంపల్లికి ఎవరూ భయపడరు. ఆయన పేరు తీసి ఎవరూ మాట్లాడలేదు. మైనంపల్లి హీరో కాదు. ఒక్కడు బయటకు రాడు. ఆయనకు కొడుకుతో పంచాయతీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏమీ ఇవ్వదు అని ఆయన అన్నారు.
కేటీఆర్ సూట్ వేసుకుంటే కాంగ్రెస్ వాళ్లకు ఇబ్బంది.. ట్వీట్ చేస్తే ఇబ్బంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్‌తో ఇబ్బంది అవుతుంది. ఎస్.బి.ఐ భూముల్లో కేటీఆర్ పాత్ర ఉంది అని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పనికి రాని ప్రభుత్వం ఉంది. కంటోన్మెంట్‌లో 6 వేల ఇందిరమ్మ ఇళ్ళు కడతామని ప్రభుత్వం చెప్పింది. కంటోన్మెంట్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారు అని క్రిశాంక్ ఫైరయ్యారు.
పిచ్చి మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దు?: నందికంటి శ్రీధర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
మైనంపల్లి మల్కాజిగిరికి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకురావాలి. కేటీఆర్‌తో కొట్లాడటం కాదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత కొట్లాటలకు తావు లేదు. బీఆర్ఎస్ సైన్యాన్ని మైనంపల్లి తక్కువగా అంచనా వేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి కొట్లాడదాం అంటే దానికి కూడా మేం సిద్దమే. హైదరాబాద్‌లో కేటీఆర్‌కు భయపడి వేరే ప్రాంతం వాళ్ళు బీఆర్ఎస్ కు ఓట్లేశారని మైనంపల్లి అంటున్నారు. మొన్న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది కదా.. భయభ్రాంతులు చేసే గెలిచారా? ప్రజా తీర్పును అవమానపరచొద్దు.
కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అనేది నిర్వివాద అంశం. దమ్ముంటే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలి. మైనంపల్లి బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరూ లేరు. ప్రజా సమస్యలపై మేం లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. దాడులు చేస్తామని అంటే మేం చేతులు ముడుచుకుని కూర్చుంటామా? మైనంపల్లి బాధ్యతతో మాట్లాడి గౌరవం పెంచుకోవాలి. పిచ్చి మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దు.
తాజావార్తలు
- ●BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!
- ●Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్
- ●TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
- ●Prabhas | బాహుబలి మూవీపై వెబ్‌సిరీస్ - ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్న ప్రభాస్, అనుష్క
- ●KTR | మీకు పట్టాలిచ్చే బాధ్యత మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భరోసా

BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!

Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్

US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్

TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ






