త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yaskhi Goud | రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న మోదీ స‌ర్కార్‌: మధుయాష్కి గౌడ్

Madhu Yaskhi Goud | దేశంలోని అన్ని జిల్లాల్లో ఆలిండియా ప్రొఫెష‌న‌ల్స్ కాంగ్రెస్ (AIPC) క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఏఐపీసీ చైర్మెన్ మ‌ధుయాష్కి (Madhu Yaskhi Goud) అన్నారు. రాజ్యాంగ నిర్మాత‌ అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు పోరాడు అనే సూత్రంతో ఏఐపీసీని నడిపిస్తానని చెప్పారు.

G

Telangana | Published On Oct 16, 2026, 12.16 pm IST

Madhu Yaskhi Goud | రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న మోదీ స‌ర్కార్‌: మధుయాష్కి గౌడ్
Advertisement

Madhu Yaskhi Goud | త్రినేత్ర న్యూస్‌: దేశంలోని అన్ని జిల్లాల్లో ఆలిండియా ప్రొఫెష‌న‌ల్స్ కాంగ్రెస్ (AIPC) క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఏఐపీసీ చైర్మెన్ మ‌ధుయాష్కి (Madhu Yaskhi Goud) అన్నారు. రాజ్యాంగ నిర్మాత‌ అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు పోరాడు అనే సూత్రంతో ఏఐపీసీని నడిపిస్తానని చెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ భ‌వ‌న్‌లో ఏఐపీసీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏఐపీసీ చైర్మన్‌గా నియమించడాన్ని పదవిగా చూడటం లేదని.. బాధ్యతగా భావించి పనిచేస్తానన్నారు. దేశవ్యాప్తంగా 50 వేల సభ్యత్వంతో, అభివృద్ధి చెందిన 100 అర్బన్ జిల్లాల్లో కమిటీలను విస్తరించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న తీరు, ప్రజాస్వామ్యం విలువలు మంట కలుపుతున్న తీరుకు వ్యతిరేకంగా నిపుణుల‌ భాగస్వామ్యం పెంచేలా పనిచేస్తామని వెల్ల‌డించారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) విజన్‌కు అనుగుణంగా ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ను దేశంలో పెంపొందించేందుకు ఏఐపీసీ తగిన పాత్ర పోషించేలా కృషి చేస్తామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం నకొనసాగుతూ.. దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, గౌరవప్రదమైన జీవనం సాగించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని (Democracy) చెప్పారు. ఆ దిశగా పౌర సమాజం, ఏఐపీసీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని వెల్ల‌డించారు. మాజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి దేశంలో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో నందన్ నిలేకనితో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. పార్టీ పాలసీ నిర్మాణంలో, దేశ అభ్యున్నతి కోసం రూపొందించే పాలసీలో ప్రొఫెషనల్స్ పాత్రను పెంచుతామన్నారు.

ప్రొఫెషనల్స్ రాజకీయ రంగంలోకి రాకుండా దూరంగా ఉంటే.. దేశం ఉన్నతమైన విలువలతో అభివృద్ధి చెందలేదని ఏఐపీసీ మాజీ చైర్మ‌న్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఆలోచనలు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్స్‌కు తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లుగా మరే రాజకీయ పార్టీలోనూ లేదన్నారు. అర్బన్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిందని.. అర్బన్ ప్రాంతాలలోనే నివసించే ప్రొఫెషనల్స్‌ను ఒక వేదికపై తీసుకురావాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు.

కార్పొరేట్ల ఆదాయం నాలుగింతలు..

మోదీ ప్రభుత్వ హాయంలో కార్పొరేట్ల ఆదాయం నాలుగింతలు కాగా.. ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగలేదని గురుదీప్ సింగ్ సప్పల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress) హాయంలో ప్రైవేటు సంస్థలు పనిచేసే ఉద్యోగులకు జీతాలు ప్రతి సంవత్సరం క్రమ పద్దతి లో పెరిగేవని.. కానీ మోదీ ప్రభుత్వ హాయంలో ఐటీ ఉద్యోగుల జీతాలు దశాబ్ద కాలంగా అంతే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో దేశంలో అన్ని వర్గాలు సంక్షేమం సంతోషంగా ఉండాలని వివరించారు. మోదీ ప్రభుత్వ హ‌యాంలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్న తీరును అడ్డుకునే క్రమంలో ప్రొఫెషనల్ పాత్ర ఎంతో కీలకమన్నారు. అన్ని రకాల వనరులున్న మన దేశం.. సూపర్ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని.. కానీ 12 ఏండ్ల మోదీ ప్రభుత్వ హ‌యాంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని దీపిందర్ సింగ్ హుడా విమ‌ర్శించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాలతో పాటు వివిధ రంగాల్లోని వృత్తి నిపుణులను ఏఐపీసీ ద్వారా ఒక వేదికపై తీసుకురావాలని సూచించారు. ఉత్తర భారతదేశంలో ఏఐపీసీ ని మరింత విస్తరించాలని సూచించారు.

Advertisement
Advertisement