త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒక‌దానికొక‌టి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్‌

PV Expressway | హైద‌రాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై (PV Expressway) కార్లు బీభ‌త్సం సృష్టించాయి. ఒక‌దానికొక‌టి వ‌రుస‌గా ఆరు కార్లు ఢీకొన్నాయి. దీంతో ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

G

Hyderabad | Published On Oct 16, 2026, 11.18 am IST

PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒక‌దానికొక‌టి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్‌
Advertisement

PV Expressway | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై (PV Expressway) కార్లు బీభ‌త్సం సృష్టించాయి. ఒక‌దానికొక‌టి వ‌రుస‌గా ఆరు కార్లు ఢీకొన్నాయి. దీంతో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని (Rajendra Nagar) ఉప్పరపల్లి సమీపంలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న ఓ కారు హ‌ఠాత్తుగా అదుపుత‌ప్పి డివైడ‌ర్‌పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో దానివెన‌కాలే వ‌స్తున్న మ‌రో 5 కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ ప్ర‌మాదంలో ఆరు కార్లు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అయితే ఆయా కార్ల‌లో ప్ర‌యాణిస్తున్న వారంతా స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కాగా, ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ జామ్ (Traffic Jam) ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్రేన్ల స‌హాయంతో దెబ్బ‌తిన్న వాహ‌నాల‌ను రోడ్డుపై నుంచి ప‌క్క‌కు తొల‌గించి ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

Advertisement
Advertisement