త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్‌

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాద‌ని, కాంగ్రెస్ తెచ్చిన క‌రువ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఎల్‌నినో వ‌స్తుంద‌ని ఈ ఏడాది మార్చి నుంచే వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రించినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Govt) ప‌ట్టించుకోలేదని ఎక్స్ వేదిక‌గా మండిప‌డ్డారు.

G

Telangana | Published On Oct 16, 2026, 10.55 am IST

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్: ఇది కాలం తెచ్చిన కరువు కాద‌ని, కాంగ్రెస్ తెచ్చిన క‌రువ‌ని (Drought) బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఎల్‌నినో వ‌స్తుంద‌ని ఈ ఏడాది మార్చి నుంచే వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రించినా కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Govt) ప‌ట్టించుకోలేదని ఎక్స్ వేదిక‌గా మండిప‌డ్డారు.

ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 750 టీఎంసీలకుపైగా గోదావరి నీళ్లను, 250 టీఎంసీలకుపైగా కృష్ణా నీళ్లను (Krishna Water) కాంగ్రెస్ స‌ర్కార్ దిగువకు విడిచిపెట్టింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని, గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా పట్టించుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎల్ నినో (El Nino) వస్తున్నదని.. ఈ ఏడాది మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేద‌ని చెప్పారు.

ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని దిగువకు వదిలేయగానే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింద‌ని వెల్ల‌డించారు. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించిందని తెలిపారు.

Advertisement
Advertisement