త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. దేశీయంగా స్థిరంగా ఉన్న ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డంతో పెట్టుబ‌డిదారుల‌కు బంగారంపై ఆస‌క్తి క‌లుగుతోంది. దీంతో గ‌త 4 వ‌రుస సెష‌న్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో శుక్ర‌వారం సైతం బంగారం ధ‌ర‌లు పెరిగాయి.

S

Business | Published On Oct 16, 2026, 11.25 am IST

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. దేశీయంగా స్థిరంగా ఉన్న ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డంతో పెట్టుబ‌డిదారుల‌కు బంగారంపై ఆస‌క్తి క‌లుగుతోంది. దీంతో గ‌త 4 వ‌రుస సెష‌న్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో శుక్ర‌వారం సైతం బంగారం ధ‌ర‌లు పెరిగాయి. ఔన్స్ బంగారం ధ‌ర 0.05 శాతం మేర స్వ‌ల్పంగా పెరిగి 4,171 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.34 శాతం పెరిగి 57 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 725 పాయింట్లు పెరిగి 1,48,214కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,340 పాయింట్లు పెరిగి 2,13,000కు చేరింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. గ‌త సెష‌న్‌లో ముగిసిన ధ‌ర‌లే ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,744 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,17,952 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,47,440 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,74,400 గా ఉంది. కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,515 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,08,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,35,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,51,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌లోనూ ఎలాంటి మార్పు లేదు.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,058 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,464గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,10,580 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,05,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌రలోనూ మార్పు లేదు.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement