Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
Automated Testing Stations | రాష్ట్రంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు రూ.425.50 కోట్ల వ్యయంతో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
Automated Testing Stations | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు రూ.425.50 కోట్ల వ్యయంతో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గతంలో ఒక్కో స్టేషన్‌కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లకు అనుమతులు మంజూరు చేయగా, తాజా ఒక్కో స్టేషన్ వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు దశల్లో 37 స్టేషన్లు
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో రూ.172.50 కోట్ల వ్యయంగా 15 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను (Automated Testing Stations) ఏర్పాటు చేస్తారు. అప్పటి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ లేదా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో అదనంగా నాలుగు స్టేషన్లను ఈ దశలో నిర్మిస్తారు. రెండో దశలో మిగిలిన 22 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌కు రూ.11.50 కోట్ల చొప్పున ఈ దశకు రూ.253 కోట్లు కేటాయించారు.
స్వయం ఆర్థిక నమూనాలో..
37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ స్వయం ఆర్థిక నమూనాలో పనిచేస్తుంది. స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన నిధులను హడ్కో (HUDCO) వంటి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించనుంది. వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు సంబంధించి వసూలు చేసే దరఖాస్తు రుసుము, పరీక్ష రుసుము, వినియోగదారు చార్జీలను SPV నిర్వహించే ప్రత్యేక నిధిలో జమ చేస్తారు. ఈ నిధులను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, నిర్వహణకు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకే వినియోగించనున్నారు.
కాగా, ఎస్పీవీ ఏర్పాటు, దాని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిర్మాణం, విధానం, ఆర్థిక నమూనాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలంగాణ రవాణా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో మొత్తం 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా వాహనాల ఫిట్నెస్ పరీక్షల నిర్వహణకు ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో జోష్.. దేశీయంగా స్థిరంగా ఉన్న ధరలు..
- ●PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
- ●KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- ●Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Road Accident | వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం
- ●Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..

Gold And Silver Prices Today | అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో జోష్.. దేశీయంగా స్థిరంగా ఉన్న ధరలు..

PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్






