Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు
Ramchandar Rao | Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో పంట పొలాలకు నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే రోజుకు 2-3 గంటలే కరెంటు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.
- పొలాలు ఎండిపోయి వారు బాధ పడుతున్నరు
- రాహుల్ కుటుంబీకులు మొత్తం నామ్ చోరీలే
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శలు
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో పంట పొలాలకు నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే రోజుకు 2-3 గంటలే కరెంటు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాహుల్ కుటుంబీకులంతా నామ్ చోరీలే అని ఆరోపించారు. సీజేపీ వంటి వారి నిరసనల కోసం విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం కలాం జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. అబ్దుల్ కలాంలోని దేశభక్తి భావన ప్రజల్లో, యూత్‌లో బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
బాంబ్ మెన్‌గా చిత్రీకరించారు..
సామాన్య కుటుంబంలో జన్మించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశ రక్షణ రంగంలో అనేక సేవలందించారు. హైదరాబాద్ డీఆర్డీవోలో పని చేసి అనేక రంగాల్లో కృషి చేశారు. న్యూక్లియర్, రాకెట్ లపై అనేక పరిశోధనలు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేసిన అణు పరీక్ష ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయిన విషయాన్ని చూశాం. పోక్రాన్ అణుపరీక్ష అయిన తర్వాత సోనియా గాంధీ, చిదంబరం అబ్దుల్‌కలాంను బాంబ్ మెన్‌గా చిత్రీకరించారు. దేశ సరిహద్దులను రక్షించే ప్రతి చర్యను కాంగ్రెస్ వ్యతిరేకించింది. కలాంను కాంగ్రెస్ ఎప్పుడూ ఆదరించలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. కలాం దేశ రక్షణ కోసమే పని చేశారు.
రాష్ట్రాన్ని పట్టించుకోవండి రేవంత్..
దివ్యాంగులకు 80 శాతం వైకల్యం ఉంటే 40 శాతానికి తగ్గించి వారికి అందల్సాన పథకాలు అందిస్తున్నారు. ఇందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు తెలంగాణలో రైతులు అల్లాడుతున్నరు. కరెంటు విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 2-3 గంటలే కరెంటు ఇస్తున్నారు. పొలాలన్నీ ఎండిపోతున్నయ్. కానీ సీఎం రేవంత్ ఏం మాట్లాడుతున్నరో అర్థమైతలేదు. వాళ్ల దగ్గర ఏం ప్రణాళికలు లేవు. రాష్ట్రాన్ని పట్టించుకోండి. విద్యార్థులు, రైతులు బాధ పడుతున్నారు. ఓటు చోరీ అంట.. ఇది ఓటు చోరీ కాదు.. కాంగ్రెస్ పార్టీ నామ్ చోరీ చేసింది. వీళ్లు గాంధీలు కారు. రాహుల్ కుటుంబీకులు మొత్తం నామ్ చోరీలు.
ఆమె మాటను ప్రజలు గుర్తించాలి
సీజేపీ వంటి వారి అల్లర్లకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని ఓ అమెరికన్ గాయకురాలు మెలి మిల్బెన్ చెప్పింది. ఇవి బీజేపీ ఆరోపణలు కాదు. ఆమె మాటను ప్రజలు గుర్తించాలి. మోదీని గద్దె దింపడానికి వాళ్లు ఈ పని చేస్తున్నారు. ఆ మధ్య అమెరికా ప్రెసిడెంట్ భారత్‌కు వస్తే మతకల్లోలాలు సృష్టించాలని చూశారు. ఇక్కడి పరువును మట్టిలో కలిపే ప్రయత్నం చేసిన తుకుడే తుకుడే గ్యాంగ్ వీళ్లంతా. ఆజాద్ ఆజాద్ అని మాట్లాడుతూ పోలీసులు, మిలటరీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ భారత్‌ను బలహీన పరచాలని చూస్తున్నారు. దేశ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. కలాంలో ఎంతో దేశభక్తి భావన ఉండే. ఇది ప్రజల్లో, యూత్‌లో బలపడాలని కోరుతున్నా అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CJI Surya Kant on Rahul Gandhi | “న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు”: సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
అక్టోబర్ 15, 2026

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్
అక్టోబర్ 15, 2026

Revanth Reddy | 15 శాతం కమీషన్.. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సీఎం రేవంత్.. ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ సంచలన ఆరోపణ
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●CJI Surya Kant on Rahul Gandhi | "న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు": సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
- ●Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు
- ●Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్
- ●Supreme Court Reservation Ruling | మతం మారినంత మాత్రాన 'బీసీ ముస్లిం' రిజర్వేషన్ రాదు: తమిళనాడు ప్రభుత్వ జీవోను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- ●USA | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..
- ●Revanth Reddy | 15 శాతం కమీషన్.. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సీఎం రేవంత్.. ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ సంచలన ఆరోపణ

CJI Surya Kant on Rahul Gandhi | "న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు": సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం

Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్

Supreme Court Reservation Ruling | మతం మారినంత మాత్రాన 'బీసీ ముస్లిం' రిజర్వేషన్ రాదు: తమిళనాడు ప్రభుత్వ జీవోను కొట్టివేసిన సుప్రీంకోర్టు






