CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ తెల్వని దొంగ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీపం పథకం కింద రూ. 400కే గ్యాస్ సిలిండర్‌ను సోనియా గాంధీ పంపిణీ చేస్తే.. మోదీ వచ్చి రూ. 1200కు పెంచి మనకు తెలియకుండానే దోచుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ తెల్వని దొంగ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీపం పథకం కింద రూ. 400కే గ్యాస్ సిలిండర్‌ను సోనియా గాంధీ పంపిణీ చేస్తే.. మోదీ వచ్చి రూ. 1200కు పెంచి మనకు తెలియకుండానే దోచుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన సీఎం.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎవరిపై కూడా విమర్శలు చేయను. సమయాన్ని వృథా చేసుకోను. గత పదేండ్ల పాలన, రెండున్నరేండ్ల మా పాలనను బేరిజు వేసుకోండి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. రైతు భరోసా, ఉచిత కరెంట్.. వాళ్లు ఏం ఇచ్చారో అవన్నీ ఇవ్వడంతో పాటు 3 కోట్ల ప్రజలకు ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం. దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు, కోళ్లకు దాణా పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్నబియ్యంతో చంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. కోట్లాది మంది సన్న బియ్యం బువ్వ తింటున్నరని సీఎం తెలిపారు.
ఇవాళ 500లకే సిలిండర్
భూమి ఉన్నోళ్లకే రైతు భరోసా, ఉచిత కరెంట్, ఎరువులు ఇస్తివి అని అంటే.. పట్నంలో ఉన్నోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 55 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. దీపం పథకం ద్వారా రూ. 400కే సోనియా గాంధీ ఆడబిడ్డలకు సిలిండర్ పంపిణీ చేశారు. మోదీ 1200 చేసిండు సిలిండర్. తెల్వని దొంగ మోదీ.. మనకు తెలియకుండానే 1200 తీసుకుపోతుండే కానీ ఇవాళ 500లకే సిలిండర్ ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరలను పిట్టలను బెదరగొట్టానికి కట్టేటోళ్లు
బతుకమ్మ చీరలను పిట్టలను బెదరగొట్టానికి కట్టేటోళ్లు. కర్టెన్లుగా కట్టుకునేవారు. కానీ ఇవాళ ఆ బతుకమ్మ చీరలు ఇస్తామంటే.. వద్దన్నారు. మేం పెట్టే ఇందిరమ్మ చీరను పుట్టింటి సారెగా భావించి కట్టుకుంటున్నరు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర పెట్టిన. బస్సు కిరాయికి ఐదు నుంచి పది వేలు ఖర్చు అయ్యేది.. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వడ్డీ లేని రుణాలు అని చెప్పి గుండు సున్నా చూపించారని రేవంత్ విమర్శించారు.
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం






