Loddi Mallayya Jatara | రేపు లొద్ది మల్లన్న జాతర.. నల్లమల అడవుల్లో వెలసిన క్షేత్రం
Loddi Mallayya Jatara | నల్లమల అడవులు.. ప్రకృతి అందాలకు నెలవు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, జలపాతాలు ప్రతృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఆ దట్టమైన అడవిలో ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. అదే లొద్ది మల్లయ్య ఆలయం (Loddi Mallayya Temple).
Loddi Mallayya Jatara | త్రినేత్ర.న్యూస్: నల్లమల అడవులు.. ప్రకృతి అందాలకు నెలవు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, జలపాతాలు ప్రతృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఆ దట్టమైన అడవిలో ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. అదే లొద్ది మల్లయ్య ఆలయం (Loddi Mallayya Temple). ఏటా తొలి ఏకాదశి (Tholi Ekadashi) సందర్భంగా లొద్ది మల్లయ్యకు భక్తులు జాతర (Loddi Mallayya Jatara) నిర్వహిస్తారు. అయితే ఈసారి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో ఉత్సవాలను ఈ నెల 25న (శనివారం) మాత్రమే నిర్వహించనున్నారు.
ఎక్కడ ఉందంటే..
నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం బాణాల శివారులోని అటవీ ప్రాంతంలో (Amrabad Tiger Reserve) ఉన్న ఓ లోయ గుహలో లొద్ది మల్లయ్య క్షేత్రం ఉన్నది. మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివలింగం స్వయంభువుగా వెలసింది. స్థానికంగా లొద్ది అంటే లోయ అని అర్థం. దీనిని మల్లన్న స్వామి లోయ అనికూడా పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చారిత్రకంగా గుప్త మల్లికార్జున అని పిలిచేవారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు మాత్రమే భక్తులను మల్లన్న దర్శనానికి అనుమతిస్తారు. దట్టమైన అడవిగుండా ఆరు జలపాతాలను దాటుతూ, 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే ఈ ఆలయానికి చేరుకొవచ్చు.

ఇక్కడ ఎత్తయిన కొండల మధ్యనున్న జలపాతం కనువిందు చేస్తుంది. భక్తులు దీనిని గుండం అని పిలుస్తారు. లొద్ది, గుండం ను కలిపి `నీలగిరి` అని పిలుస్తారు. ఈ గుండం సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో ఉంటడటంతో పైకి వెళ్లడానికి 1953లోనే ఇనుప నిచ్చెన ఏర్పాటు చేయడం విశేషం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CJP | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. అప్పుడే కేంద్రంతో చర్చలు: సీజేపీ
- ●Pandharpur Wari 2026 | ఆషాఢ ఏకాదశి 2026: పండరీపురంలో భక్తజన సంద్రం.. పూజా సమయాలు, కంప్లీట్ ట్రావెల్ గైడ్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..
- ●Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్డేట్..
- ●WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..

CJP | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. అప్పుడే కేంద్రంతో చర్చలు: సీజేపీ

Pandharpur Wari 2026 | ఆషాఢ ఏకాదశి 2026: పండరీపురంలో భక్తజన సంద్రం.. పూజా సమయాలు, కంప్లీట్ ట్రావెల్ గైడ్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..

NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..






